యోగా చేయడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ యోగా కారణంగా.. సాధారణ ఆరోగ్య సమస్యలు తగ్గడమే కాదు.. స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను కూడా తగ్గించేస్తాయి. ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా.. సంతానోత్పత్తి తగ్గి.. పిల్లలు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. సంతానోత్పత్తి కోసం ఆస్పత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. అలాంటివారు యోగాలోని కొన్ని ఆసనాలను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల.. వారిలో సంతానోత్పత్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ ఆ ఆసనాలేంటో ఓసారి చూద్దాం..
మనిషిలోని ఒత్తిడి, హార్మోనల్ ఇన్ బాలెన్స్ లను సమతుల్యం చేసే సత్తా యోగి ఉంది. యోగా థెరపీ చేయడం వల్ల అంతర్గత అవయవాల సరైన పనితీరును ప్రోత్సహించడానికి, లైంగిక కోరిక లు పెంచడం, సంతానోత్పత్తి కలుగుతుంది.
సంతానోత్పత్తి చికిత్స తీసుకునేటప్పుడు ఒత్తిడి ముఖ్యంగా మీ గర్భం దాల్చే అవకాశాలను ప్రభావితం చేస్తుంది. అయితే.. యోగా చేయయడం వల్ల మీ మనస్సు, శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి , సహజంగా గర్భం దాల్చడానికి మీకు సహాయపడుతుంది.
"ఒత్తిడి హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి, మీ ఒత్తిడి స్థాయిని తగ్గించడం వల్ల మీ హార్మోన్లను కూడా సమతుల్యం చేస్తుంది. రెగ్యులర్ వ్యాయామాలు మీ శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేయడంలో సహాయపడటమే కాకుండా, మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కండరాలను బలోపేతం చేయడం మరియు సాగదీయడంలో సంతానోత్పత్తి వ్యాయామాలు ఎండోక్రైన్ (హార్మోనల్) వ్యవస్థ, అండాశయాలు, గర్భాశయాన్ని ప్రేరేపిస్తాయి" అని వైద్యులు తెలిపారు.
కోబ్రా పోజ్..
ఇది యోగాసనం వేయడం చాలా సులభం. ముందుగా బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత మీ రెండు చేతులను చాతికి ఇరువైపులా ఉంచాలి. ఆ తర్వాత.. చేతనుల అదిమి పెట్టి.. ఛాతిని పైకి లేపాలి. ఆ తర్వాత శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదలుతూ ఉండాలి. ఇలా 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండాలి. ఇలా పది సార్లు రిపీట్ చేయాలి.
లాభాలు
- ఊపిరితిత్తులు , ఛాతీ బాగా ఓపెన్ అవుతాయి
-పెల్విక్ ప్రాంతం , పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది
1.బ్రిడ్జ్ పోజ్..
ఈ యోగాసనంలో మీ బాడీకి ఒక వంతెనలా మార్చాలి. ముందుగా... వెల్లకిలా పడుకోవాలి. తర్వాత రెండు కాళ్లను మడత పెట్టాలి. వాటిని దగ్గరకు తీసుకువచ్చి.. కింద నుంచి చేతులతో కాళ్లను పట్టుకోవాలి. ఇప్పుడు నడుము పైకి ఎత్తేందుకు ప్రయత్నించాలి. ఆ సమయంలో శ్వాస పీలుస్తూ... వదులుతూ ఉండాలి. ఇలా కనీసం రోజుకు పదిసార్లు ప్రయత్నించాలి. పది సెకన్ల పాటు.. ఆ బ్రిడ్జ్ పోస్ లో ఉంటే సరిపోతుంది.
లాభాలు
- పెల్విస్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
- బిగుతుగా ఉండే కండరాలను బలపరుస్తుంది.
- పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడానికీ, స్త్రీలలో సంతానొత్పత్తికి ఉపయోగపడుతుంది.
బటర్ ఫ్లై పోజ్..
ఇది చేయడం చాలా సులువు. ముందుగా.. కింద కూర్చోవాలి. తర్వాత రెండు పాదాలను కలిపి పట్టుకోవాలి. మీ వీపును నిటారుగా ఉంచి.. పాదాలను చేతితో పట్టుకొని. సీతాకోక చిలుక రెక్కల మాదిరి ఆడిస్తూ ఉండాలి.
లాభాలు
-లోపలి తొడ పెల్విక్ ఫ్లోర్‌ను సాగదీస్తుంది
- పునరుత్పత్తి అవయవాలకు ప్రసరణను మెరుగుపరుస్తుంది
child pose yoga
చైల్డ్ పోజ్
ఈ భంగిమ మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి , విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ వెన్నెముకకు చాలా మంచి స్ట్రెచ్. మోకాలి స్థానానికి వచ్చి, ఆపై మీ తుంటిని మడమల వరకు తాకండి. ఈ కూర్చున్న భంగిమలో, ముందుకు వంగి, మీ చేతులు,చేతులను మీ తలపైకి చాచండి. ఈ ఆసనంలోనూ శ్వాస పీలుస్తూ, వదులుతూ ఉండాలి.
లాభాలు
-మీ వెన్నెముక , కటి ప్రాంతాన్ని రిలాక్స్ చేస్తుంది
- మీ మనస్సును రిలాక్స్ చేస్తుంది
- అండాశయాలను ఉత్తేజపరుస్తుంది
"ఇవి మీరు మీ ఇంటి సౌలభ్యం నుండి చేయగలిగే అత్యంత ప్రభావవంతమైన , సులభమైన యోగా భంగిమలు. ఈ యోగా భంగిమలు మీ ప్రస్తుత వంధ్యత్వ స్థితిని మార్చడానికి , మీరు త్వరగా గర్భం దాల్చడానికి మీకు సహాయపడతాయని వైద్యులు తెలిపారు.