50 లోనూ 30 లా కనిపించాలా..? చేయాల్సింది ఇదే..!

First Published | Oct 8, 2024, 10:27 AM IST

మళ్లీ...మనల్ని మనం యవ్వనంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంతలా అంటే... ఐదు పదుల వయసు దాటినా.. 30ఏళ్ల వారిలా కనపడొచ్చు. అంత యవ్వనంగా, అందంగా కనపడతారు. మరి.. దాని కోసం ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

పెరిగే వయసును మనం ఆపలేం. కానీ.. ఆ పెరిగే వయసును కనిపంచకుండా అయితే చేయవచ్చు. నిజానికి.. మన వయసు పెరుగుతుంటే.. మన శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి.దాని ప్రభావం మన ముఖంపై స్పష్టంగా కనపడుతుంది.  మన వయసు పెరిగినట్లు కనపడటానికి.. మనం తినే ఆహారం, మన అలవాట్లు కారణం కావచ్చు. వాటిలో మార్పులు చేసుకుంటే.. మళ్లీ...మనల్ని మనం యవ్వనంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎంతలా అంటే... ఐదు పదుల వయసు దాటినా.. 30ఏళ్ల వారిలా కనపడొచ్చు. అంత యవ్వనంగా, అందంగా కనపడతారు. మరి.. దాని కోసం ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 

belly button

1.నాభికి నూనె రాయడం....
మీకు నమ్మసక్యంగా అనిపించకపోయినా ఇది నిజం.. మీరు రోజూ రెగ్యులర్ గా మీ బొడ్డుకు నూనె రాస్తే చాలు. ఆయుర్వేదంలో దీనిని నాభి తైలం అని పిలుస్తారు.  నాభి నుంచి మన శరీరం లోని అన్ని భాగాలకు కనెక్ట్ అయ్యేలా కనెక్షన్ ఉంటుంది.  అందుకే.. రోజూ పడుకునే ముందు.. బొడ్డులో నాలుగు చుక్కల నూనె వేస్తే చాలు.. శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పడుకునే ముందు కాకపోతే... ఉదయం పూట స్నానం చేసిన తర్వాత అయినా.. రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల.. మీ వయసు తగ్గిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

అంతేకాదు... ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల  జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దాదాపు 50 తర్వాత ఏ ఆహారం తిన్నా అరగడం లేదు అని ఫీలౌతుంటారు. కానీ... ఇలా చేయడం వల్ల.. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది. సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.
పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గిపోతుంది. కీళ్ల నొప్పులు దూరమవుతాయి. ముఖానికి మెరుపు వస్తుంది. యవ్వనంగా కనపడటమే కాదు.. మీ బాడీ కూడా ఫిట్ గా తయారౌతుంది. 


2.ముక్కులో తైలం..
నాభిలో మాత్రమే కాదు... ముక్కులో ఔషధ గుణాలు ఉన్న తైలం వేసుకోవడం వల్ల కూడా.. మీరు వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారని మీకు తెలుసా? చాలా రకాల వ్యాధులను తగ్గించడంలో ఇది సహాయం చేస్తుంది. ఇలా ముక్కులో తైలాలు వేసుకోవడం వల్ల  శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మైగ్రేన్ , తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ముఖ పక్షవాతం , నరాల సంబంధిత రుగ్మతలలో ఉపశమనాన్ని అందిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఇది సైనసైటిస్‌లో కూడా ఉపశమనం ఇస్తుంది.

3.స్కాల్ప్ మసాజ్...

జుట్టు,  ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి వేళ్లతో తలపై మసాజ్ చేస్తారు. నిర్జీవమైన జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచేందుకు, పెరుగుదలను ప్రోత్సహించడానికి ఇది ఒక గొప్ప మార్గం. రాత్రి పడుకున్న తర్వాత, ఉదయం లేచిన తర్వాత తలకు మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల  జుట్టు ఆరోగ్యం బాగానే ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. మైగ్రేన్ , తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.
జుట్టు బలంగా మారుతుంది. చుండ్రు సమస్య దూరమవుతుంది.


4.డ్రై బ్రషింగ్..

డ్రై బ్రషింగ్ అనేది సహజమైన బ్రిస్టల్ బ్రష్‌తో శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం, ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది, శోషరస వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.  రక్త ప్రసరణను పెంచుతుంది. స్నానానికి ముందు డ్రై బ్రష్ చేయడం వల్ల చర్మం మెరుగుపడటమే కాకుండా ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.చర్మం మృదువుగా మారుతుంది.
డెడ్ స్కిన్ తొలగిపోతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది టాన్ తొలగించడంలో ఉపయోగపడుతుంది. చర్మం నిర్విషీకరణ చెందుతుంది.
ఒత్తిడి దూరమవుతుంది.

5.బాడీ మసాజ్...
బాడీ అనేది ఒక రకమైన ఆయుర్వేద మసాజ్, దీనిలో శరీరాన్ని గోరువెచ్చని నూనెతో మసాజ్ చేస్తారు. ఇది శరీరం , మనస్సు  శక్తిని సమతుల్యం చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, బాడీ మసాజ్ ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో చేయాలని గుర్తుంచుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడమే కాకుండా, మీరు చాలా కాలం పాటు యవ్వనంగా , అందంగా కనిపించేలా చేస్తుంది.

వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. దృష్టి మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. రాత్రిపూట మంచిగా నిద్రపోగలుగుతారు. మానసిక సమస్యలు ఏమైనా ఉంటే.. అవన్నీ తగ్గిపోతాయి.

feet massage


6.పాదాలకు మసాజ్..
చివరగా.. మీరు రెగ్యులర్ గా పాదాలకు ఆయిల్ తో రాత్రిపూట మసాజ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. బాడీలో రక్త ప్రసరణ మంచిగా మెరుగుపరుస్తుంది. మీ బాడీకి మంచి రిలాక్స్ గా కూడా అనిపిస్తుంది. దీని వల్ల కచ్చితంగా శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగానూ మీ వయసు తగ్గిపోతుంది.

Latest Videos

click me!