కొవిడ్-19(కరోనా) దెబ్బతో ప్రపంచం వణికిపోతోంది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. జలుబు, దగ్గు ఉన్న వారి పక్కన కూర్చోవాలన్నా కూడా వణుకుతున్నారు. దానికి తోడు పలు దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళుతున్నారు.గర్భిణీలకు అయితే.. ఆస్పత్రికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే... ఓ మహిళ మాత్రం కరోనా భయం, లాక్ డౌన్ కారణంగా డెలివరీ సమయం దగ్గరపడినా ఆస్పత్రికి వెళ్లడానికి ఇష్టపడలేదు.
undefined
ఇంట్లోనే మహిళ ప్రసవించింది. అయితే.. తాను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోయినా.. తన బిడ్డ పుట్టడం ప్రపంచం మొత్తం చూడాలని ఆశపడింది. అందుకే తన ప్రసవాన్ని ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ టెలికాస్ట్ చేసింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
ఆమె పేరు ఎమ్మా. అప్పటికే ఆమెకు ఐదుగురు సంతానం ఉన్నారు. కాగా... ఆరోసారి మరోసారి గర్భం దాల్చింది. మరి కొద్ది రోజుల్లో తాను బిడ్డకు జన్మనివ్వనున్నాను అనగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది.
undefined
తాను తన బిడ్డను ప్రసవించడాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ఆ పోస్టులో పెట్టింది.
undefined
ఈ మేరకు ఆమె లైవ్ కూడా ఇచ్చింది. ఆమె ఐదుగురు సంతానం, భర్త , ఆమె పెంపుడు కుక్క కూడా ఆసమయంలో ఆమె పక్కనే ఉన్నారు.
undefined
ఎట్టకేలకు తెల్లవారుజామున ఐదు గంటలకు ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.
undefined
డెలివరీకి ముందు ఆమె మిగిలిన ఐదుగురు సంతానం ఆమెకు..ఓ నెక్ లెస్ బహుమతిగా ఇచ్చారు. దానిని ఆమె ధరించిన తర్వాతే బిడ్డకు జన్మనివ్వడం విశేషం.
undefined
కాగా.. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆరో సంతానానికి జన్మనివ్వడం పట్ల ఎమ్మా సంతోషం వ్యక్తం చేసింది. కాగా.. ఆమె ఇన్ స్టా ఎకౌంట్ కి 57వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
undefined