పీరియడ్స్ క్రమం తప్పయా..? ఈ ఫుడ్స్ ట్రై చేయండి..!

First Published | Jun 4, 2020, 2:54 PM IST

ఒక్కోసారి మిస్సైనా పెద్ద సమస్యేమీ కాదని చెబుతుంటారు డాక్టర్లు. ఒకటీ, రెండు సార్లు అయితే పర్లేదు కానీ అదే కంటిన్యూ అయితే మాత్రం ఇబ్బందే. ఏదీ ప్లాన్ చేసుకోవడానికి ఉండదు.

పీరియడ్స్ నెల నెలా వస్తూ ఉంటాయి. ఒక్ససారి రుత్రుసావం రావడం మొదలైతే... మళ్లీ మోనొపాజ్ దశ చేరుకునే వరకు ఇవి వస్తూనే ఉంటాయి. వచ్చి ప్రతి నెలా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.
undefined
పీరియడ్స్ సమయంలో అమ్మాయిల మూడ్ స్వింగ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కోపం, చిరాకు అన్నీ వచ్చేస్తాయి. ప్రతి నెలా ఈ బాధ తప్పదా అనిపిస్తుంది. దానికి తోడు భరించలేని నొప్పి కూడా ఉంటుంది.
undefined

Latest Videos


అయితే.. నొప్పి వచ్చిందని, నెలసరి వచ్చిందని ఇబ్బంది పడతారు కానీ.. అది క్రమం తప్పితే మరింత ప్రమాదం. నెలసరి సక్రమంగా వస్తేనే ఆరోగ్యం. ఒక్కోసారి మిస్సైనా పెద్ద సమస్యేమీ కాదని చెబుతుంటారు డాక్టర్లు.
undefined
ఒకటీ, రెండు సార్లు అయితే పర్లేదు కానీ అదే కంటిన్యూ అయితే మాత్రం ఇబ్బందే. ఏదీ ప్లాన్ చేసుకోవడానికి ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బంది. సడెన్‌గా వస్తుందేమో అన్న ఆలోచనతోనే రోజులు గడపాల్సిన పరిస్థితి.
undefined
బాడీ క్లాక్ సరిగా పనిచేయడం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఏ ఒక్కటి తప్పినా దేనికి దారితీస్తుందో అనే టెన్షన్. భవిష్యత్ పరిణామాలు కళ్లముందు కనిపించి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంటాయి.
undefined
సరైన ఆహారపు అలవాట్లతో పాటు, శరీరానికి తగినంత వ్యాయామం ఉంటే ఈ సమస్యను కొంత వరకు నివారించవచ్చు. ఇంట్లో పాటించే కొన్ని చిట్కాలు కూడా పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడానికి సహకరిస్తాయి.
undefined
అల్లం: ఓ కప్పు నీటిలో టేబుల్ స్పూన్ తాజా అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఐదు నిమిషాలు మరిగిన తరువాత వడకట్టి ఓ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి భోజనం చేసిన తరువాత తాగితే చక్కని ఫలితం ఉంటుంది.
undefined
సోంపు: పీరియడ్స్ సమస్యని కంట్రోల్ చేస్తుంది సోంపు. నెలసరి సమయంలో వచ్చే నొప్పులను కూడా తగ్గిస్తుంది. పీరియడ్స్ రెగ్యులరైజ్ కోసం రెండు టీ స్పూన్ల సోంపుని తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. సమస్య తగ్గే వరకు అంటే పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే వరకు వాడుతుండాలి.
undefined
దాల్చిన చెక్క: హర్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో దాల్చిన చెక్క పాత్ర ప్రముఖమైనది. రుతుక్రమ సమస్యలకు దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చని పాలలో కలిపి తాగాలి. పాలు అలవాటు లేకపోతే తీసుకుని ఆహరంపైన ఈ పొడిని చల్లుకుని తినవచ్చు. దీని వలన పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి.
undefined
క్యారెట్, ద్రాక్ష జ్యూసులు రుతుక్రమ సమస్యలను దూరం చేస్తాయి. ఆపిల్ సిడర్ వెనిగర్ కూడా సమస్యను పరిష్కరిస్తుంది. గ్లాస్ నీటిలో రెండు స్పూన్స్ ఆపిల్ సిడర్ వెనగర్ వేసుకుని భోజనానికి ముందు తాగుతుండాలి. తీసుకున్న తరువాత ఓ పది నిమిషాలు ఆగి భోజనం చేయాలి.
undefined
click me!