bedsheet
మనం ప్రతిరోజూ స్నానం చేస్తాం.. దుస్తులు కూడా మార్చుకుంటాం. అయితే.. బెడ్రూమ్ లో బెడ్ షీట్స్ ని మాత్రం మార్చరు. కానీ.. తరచూ బెడ్ షీట్స్ మార్చకపోతే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ షీట్ శుభ్రంగా ఉంటేనే... మనం ప్రశాంతంగా నిద్రపోగలం. అంతేకాకుండా.. బెడ్ షీట్స్ మార్చకపోవడం వల్ల.. మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటామో ఇప్పుడు చూద్దాం..
bedsheet
అనేక వ్యాధులకు బెడ్ షీట్ మూలం: నమ్మకసక్యంగా లేకపోయినా ఇదే నిజం. బెడ్ షీట్ లు.. అనేక వ్యాధులకు మూలం . కోరానా కాలంలోనే కాదు... మామూలు సమయంలోనూ.. బెడ్ షీట్స్ నుంచి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. ఈ సమయంలో మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఒకే బెడ్ షీట్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది మెనోపాజ్, శ్వాసకోశ వ్యాధులు, STDలు నిద్ర సమస్యలకు దారితీస్తుంది.
తరచుగా మనం పడుకునే ముందు కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు పాదాలకు, తలకు నూనె రాసుకుంటూ ఉంటారు. అది బెడ్ షీట్ కి అంటుకొని మాసిపోతుంది. అలా మారిన రోజు.. వెంటనే మార్చేయాలి. మన కళ్లకు బెడ్ షీట్ శుభ్రంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ.. మన కళ్లకు కనిపించని దుమ్ము, దూళి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
బెడ్‌షీట్ ఎప్పుడు ఉతకాలి? : బెడ్ షీట్ మురికిగా ఉంటే.. అది అనారోగ్యానికి కారణం అవుతుందని మనకు తెలుసు. కానీ.. దానిని మార్చడానికి మాత్రం వెనకాడతారు. సాధారణంగా 3-4 వారాలకు ఒకసారి బెడ్ షీట్ , దుప్పటిని ఉతుకుదాం అని అనుకుంటారు. కానీ.. నిజానికి.. వారానికి ఒకసారి బెడ్ షీట్ కచ్చితంగా మార్చేయాలి. వారానికి ఒకసారి బెడ్ షీట్ శుభ్రం చేసుకుంటే.. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మన శరీరం ప్రతిరోజూ 40,000 మృత చర్మ కణాలను విడుదల చేస్తుంది. ఇవన్నీ.. బెడ్ షీట్ పైకి చేరతాయి. అవంతా బ్యాక్టీరియాగా రూపాంతరం చెందుతాయి. అవన్నీ.. మన ఆరోగ్యం, నిద్రపై ప్రభావం చూపిస్తాయి.
SEX
మీరు వారానికి ఒకసారి బెడ్ షీట్ మార్చితే.. మీకు మొటిమలు, అలెర్జీలు, తామర, ఉబ్బసం, జలుబు, జ్వరం మొదలైనవి రాకుండా కాపాడుకోవచ్చు. అలా కాకుండా.. మార్చకుండా.. నెలల పాటు దానినే వినియోగిస్తే.. వివిధ రకాల చర్మ సమస్యలు మిమ్మల్ని వెంటాడటం మొదలుపెడతాయి. న్యుమోనియా, గనేరియాతో సంబంధం ఉన్న బ్యాక్టీరియా 7 రోజులలోపు మీ బెడ్‌లో పెరగడం ప్రారంభమవుతుంది.
నెలల తరబడి బెడ్ షీట్ వినియోగం: పాత బెడ్ షీట్లపై పరిశోధనలు జరిగాయి. సెవిల్లె విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగం మైక్రోస్కోప్‌లో 4 వారాల బెడ్ షీట్‌ను పరిశీలించింది. న్యుమోనియా, గోనేరియా , అపెండిసైటిస్‌తో సంబంధం ఉన్న బ్యాక్టీరియా కనుగొన్నారు.
గొంతు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఫ్యూసోబాక్టీరియాను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందుకే.. ఈ విషయంలో కాస్త బద్దకాన్ని పక్కన పెట్టి.. వారానికి ఒకసారి.. బెడ్ షీట్స్ మార్చడం ఇప్పటి నుంచే మొదలుపెట్టండి.