periods
ప్రతి మహిళ నెలకోసారి నెలసరి నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఈ నొప్పి వస్తుందని కాదు. కానీ కొంతమందికి మాత్రం ప్రతి నెలా తట్టుకోలేనంత నొప్పి వస్తుంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు మందులను వాడుతుంటారు. కానీ మందులను ఎక్కువగా వాడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే పీరియడ్స్ నొప్పిని సహజంగా తగ్గించడానికి కొన్ని రకాల టీలు ఉపయోగపడతాయి. అవేంటంటే?
ginger tea
అల్లం టీ
అల్లం టీ చాలా టేస్టీ టేస్టీ ఉంటుంది. అంతేకాదు దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అల్లం టీని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది కడుపు మంట, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం టీ తాగితే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
పసుపు పాలు
ఎన్నో ఏండ్లుగా పసుపు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మంటను, నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
చామంతి టీ
చామంతి టీ లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ టీని తాగతే నెలసరి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పీరియడ్స్ టైం లో చామంతి టీ తాగడం వల్ల పీరియడ్స్ తిమ్మిరి తగ్గుతుంది. చామంతి టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి కండరాలను సడలించడానికి, నెలసరి నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
పుదీనా టీ
పుదీనా ఒక సహజ కండరాల సడలింపు. ఇది తిమ్మిరిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. పీరియడ్స్ పెయిన్ ఉన్నప్పుడు పుదీనా టీ ని తాగితే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
cinnamon tea
దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చినచెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పీరియడ్ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.