Latest Videos

ఇంట్లో రోజ్ వాటర్ ను ఎలా తయారుచేయాలి?

First Published May 26, 2024, 11:21 AM IST

రోజ్ వాటర్ ను ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తుంటారు. ఇది మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది రెగ్యులర్ గా వాడుతుంటారు.అయితే దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రోజ్ వాటర్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించి ముఖాన్ని అందంగా, గ్లో వచ్చేలా చేయొచ్చు. ఇంట్లో రోజ్ వాటర్ ను తయారుచేయడానికి గులాబీ పువ్వుల రేకులను తీసుకుని వీటికి దుమ్ము లేకుండ శుభ్రంగా కడగండి. 


గులాబీ రేకులను బాగా కడిగిన తర్వాత బాణలిలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో శుభ్రం చేసిన గులాబీ రేకులను వేయండి. దీన్ని మీడియం మంట మీద బాగా మరిగించండి. ఈ నీరు మరుగుతున్నప్పుడు, గులాబీ రేకుల రంగు మారడం ప్రారంభమవుతుంది. 

గులాబీ రేకుల రంగు పూర్తిగా మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ ను దించి పక్కన పెట్టండి. చివరగా నీటిని చల్లార్చి గులాబీ రేకులను వడపోసి నీటిని మాత్రమే బయటకు తీస్తే రోజ్ వాటర్ రెడీ అయినట్టే.. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. మీరు ఇంట్లో కేవలం పది నిమిషాల్లోనే దీన్ని తయారుచేయొచ్చు. 
 

మీరు తయారుచేసిన గులాబీ వాటర్ ను ఒక బాటిల్ లో పోసి దానిని రిఫ్రిజిరేటర్ లో లేదా చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. మీరు దీన్ని గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచితే, ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు మార్కెట్ లో  రోజ్ వాటర్ కొంటున్నట్టైతే ఇలా సింపుల్ గా ఇంట్లోనే రోజ్ వాటర్ ను తయారుచేసి వాడండి. 

click me!