దురద లేదా చికాకు కలిగించే విషయాలు
చికాకు కలిగించే రసాయనాలు కూడా యోని దురదకు కారణమవుతాయి. ఇవి అలెర్జీ ప్రతిచర్యకు కారణమవుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది యోనిని శుభ్రంగా ఉంచడానికి టీవీలో చూపించే యోని వాష్ లను ఉపయోగిస్తున్నారు. కానీ ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఉపయోగించడం వల్ల ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. ఈ యోని వాష్ లు యోని దురదకు కూడా కారణమవుతాయి. వీటితో పాటుగా సబ్బు, బబుల్ బాత్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్, ఆరోమాటిక్ టాయిలెట్ పేపర్, సింథటిక్ కోటింగ్ ఉన్న శానిటరీ న్యాప్కిన్లు కూడా దురదకు కారణమవుతాయి.