ఫ్రిజ్ లో చపాతీ పిండి పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published Apr 27, 2024, 3:22 PM IST

చాలా మంది చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కొంతమంది పిండి మెత్తగా ఉండాలని ఫ్రిజ్ లో పెడితే.. మరికొంతమంది మాత్రం రేపటికి దీనితో చపాతీలు చేసుకోవచ్చని పెడుతుంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?
 

ప్రతిరోజూ చపాతీలను పక్కాగా తినేవారు చాలా మందే ఉన్నారు. అయితే చపాతీలు మెత్తగా, స్మూత్ గా రావాలని చాలా మంది పిండిని బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టెస్తుంటారు. ఇలా పెట్టడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయన్నది నిజమే. మరికొంతమంది చపాతీ పిండిని మరీ ఎక్కువగా కలిపేసి రేపటికి ఫ్రిజ్ లో పెడుతుంటారు. దీనివల్ల పిండి పాడవకుండా ఉంటుందని ఇలా చేస్తుంటారు. కానీ ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును ఫ్రిజ్ లో పెట్టిన చపాతీ పిండి మన శరీరానికి ఎంతో చేటు చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కడుపు సమస్యలు

చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెడితే పిండిలో చాలా సులువుగా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో చేసిన చపాతీలను తింటే కడుపు నొప్పి వస్తుంది. 

పోషకాహార లోపం

చపాతీ పిండిలో మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి. చపాతీలు మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. కానీ మీరు ఈ చపాతీ పిండిని 4 నుంచి 5 గంటలకు పైగా ఫ్రిజ్ లో ఉంచితే.. దానిలో ఉండే మినరల్స్, విటమిన్స్ అన్నీ కరిగిపోతాయి. 
 

జీర్ణ సమస్యలు

మీరు చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెట్టగానే ఫ్రిజ్ నుంచి హానికరమైన వాయువులన్నీ పిండిలోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి పిండితో చేసిన చపాతీలను మీరు తింటే మీకు కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 

చపాతీ నాణ్యతపై ప్రభావం

ఫ్రిజ్ లో చపాతీ పిండిని కాసేపు పెడితే అవి స్మూత్ గా వస్తాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఫ్రిజ్ లో ఉంచిన పిండితో చపాతీలు తయారుచేస్తే చపాతీలు గట్టిగా ఉంటాయి. అంతేకాదు వాటి టేస్ట్ కూడా మారుతుంది. 
 

కంటైనర్ లో ఉంచొద్దు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిండిని గాలి చొరబడని కంటైనర్ లో అస్సలు ఉంచకూడదు. అలాగే ఫ్రిజ్ లో కూడా అస్సలు పెట్టకూడదు. దీనివల్ల పిండి పాడవుతుంది. వీటిని తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే పిండిని ఎప్పటికప్పుడు తాజాగా తినడమే మంచిది. మిగిలిపోయిన పిండిని రిఫ్రిజిరేటర్ లో పెట్టి మరుసటి రోజు చపాతీలు చేసి తినే అలవాటును మానుకోండి. 

click me!