అయితే... బ్రా ధరించడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి..
కొంతమంది మహిళలు బ్రా ధరించడం అసౌకర్యంగా భావిస్తారు. కొందరు మహిళలకు బ్రాలు ధరించినప్పుడు చాలా చెమటలు పడతాయి, ఇది మొటిమలు , ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. ఆకారం కోసం నిరంతరం బ్రా ధరించడం వల్ల రొమ్ము కణజాలం దెబ్బతింటుంది. బ్రా ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. మీ వీలును బట్టి.. కంఫర్ట్ గా ఉండేవి ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా కాటన్ క్లాత్ తో ఉన్నవి ఎంచుకుంటే.. ఎక్కువ స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటాయి. మరీ టైట్ గా కూడా ఉండేవి కూడా వేసుకోకపోవడమే మంచిది.