తడి అండర్ వేర్ లను వేసుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 7, 2024, 3:20 PM IST

అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తడి అండర్ వేర్ లను ధరిస్తుంటారు. కానీ ఇలా వేసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? 
 

లోదుస్తులు ఎంత నీట్ గా ఉంటే మీ ఆరోగ్యం అంత బేషుగ్గా ఉంటుంది. మురికి లోదుస్తులను వేసుకున్నా, టైట్ గా ఉండే అండర్ వేర్ లను వేసుకున్నా లేనిపోని సమస్యలు వస్తాయి. అయితే కొంతమంది తడిగా ఉండే అండర్ వేర్ లను కూడా వేసుకుంటుంటారు. కానీ ఇలా అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


బాక్టీరియల్ ఇన్ఫెక్షన్

తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. అయితే మీరు తడిగా ఉండే అండర్ వేర్ లను ధరించడం వల్ల యోనిలో బ్యాక్టీరియా సంక్రమణ, మూత్ర మార్గ సంక్రమణ ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Vaginal Care

చికాకు

తడి బట్టలు యోనిపై చికాకును కలిగిస్తాయి. అలాగే ఇవి యోనిని ఎర్రగా అయ్యేలా చేస్తాయి. అలాగే దద్దుర్ల సమస్యను కలిగిస్తాయి. 
 

ఫంగల్ ఇన్ఫెక్షన్

తడి లోదుస్తులు యోనిలో ఫంగస్ పెరిగే వాతావరణాన్ని సృష్టిస్తాయి. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తాయి. ఇది పెద్దగా సమస్యగా మారుతుంది. 
 


పిహెచ్ బ్యాలెన్స్ కు అంతరాయం

తడి లోదుస్తులను క్రమం తప్పకుండా ధరించడం వల్ల మీ యోని  పిహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల మీరు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.
 

చిరాకు

వ్యాయామం చేసేటప్పుడు లోదుస్తులు తడిగా ఉండటం లేదా తడి లోదుస్తులు ధరించడం వల్ల మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దురద, చికాకును కలిగిస్తుంది. ఈ సమస్యలేమీ రాకూడదంటే వ్యాయామం చేసిన తర్వాత లేదా స్నానం చేసిన తర్వాత మీ అండర్ వేర్ లను మార్చండి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు ప్యాంటీ లైనర్లు ఉపయోగించండి.

Latest Videos

click me!