తెల్లజుట్టుకు మెహందీని ఎలా పెడితే నల్లగా అవుతుందో తెలుసా?

First Published | Jun 7, 2024, 9:48 AM IST

ఈ రోజుల్లో చిన్నవయసు వారికి కూడా తెల్లవెంట్రుకలు వస్తున్నాయి.  తెల్లవెంట్రుకలు కనిపించకుండా మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్ లను వాడుతుంటారు. కానీ వీటిని వాడినా రెండు మూడు రోజుల్లో మళ్లీ తెల్లవెంట్రుకలు కనిపిస్తుంటాయి. అలాగే వీటిలో కెమికల్స్ వల్ల వెంట్రుకలు కూడా దెబ్బతింటాయి. అందుకే చాలా మంది హెన్నాను పెడుతుంటారు.
 

henna

మెహందీని కేవలం చేతులకే కాదు జుట్టుకు కూడా ఉపయోగించొచ్చు. అవును ఇది జుట్టుకు మంచి రంగును ఇస్తుంది. జుట్టుకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మెహందీలో ఉండే విటమిన్ సి, విటమిన్ డి, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండటానికి చాలా మంది మెహందీని పెడుతుంటారు. అయితే చాలా సార్లు దీన్ని పెట్టినా పెద్దగా తేడా కనిపించదు. అయితే దీనిలో ఉసిరి పొడిని వేసి కలిపి జుట్టుకు పెడితే వెంట్రుకలు నల్లగా అవుతాయి. మరి దీన్ని సరిగ్గా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


జుట్టుకు ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు,  ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉసిరి మన జుట్టుకు మంచి పోషణను అందించడానికి, జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. 

Latest Videos


జుట్టుకు ఉసిరి, గోరింటాకు ప్రయోజనాలు

గోరింటాకు, ఉసిరి రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టు చిన్నవయసులోనే తెల్లబడకుండా రక్షిస్తాయి. మెహందీని, ఉసిరి రెండింటినీ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తొలగిపోతుంది.
 

ఉసిరి-మెహందీ ప్యాక్ ఎలా తయారు చేయాలి? 

ఉసిరి, మెహందీ ప్యాక్ ను తయారుచేయడం చాలా ఈజీ. దీన్ని తయారుచేయడానికి ఒక గిన్నెలో 2 నుంచి 3 టీస్పూన్ల గోరింటాకు పొడిని తీసుకోండి. దీనిలో 2 టీస్పూన్ల ఉసిరి పొడిని వేసి  బాగా కలపండి. ఈ పేస్ట్ ను 3 నుంచి 4 గంటల పాటు మూతపెట్టి పక్కన పెట్టండి. 
 

గోరింటాకును జుట్టుకు ఎలా అప్లై చేయాలి?

ఇప్పుడు మెహందీ-ఉసిరికాయ ప్యాక్ ను  జుట్టుకు అప్లై  చేసి 1-2 గంటలు అలాగే ఉంచండి. ఆ తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో కగడండి. దీనివల్ల జుట్టు తేమగా ఉంటుంది. మంచి రంగు కూడా వస్తుంది.
 

మెహందీని ఎన్ని రోజులకోసారి పెట్టుకోవాలి? 

గోరింటాకు, ఉసిరి హెయిర్ ప్యాక్ ను 2 వారాలకు ఒకసారి జుట్టుకు అప్లై చేయాలి. ఇది మీ జుట్టును నల్లగా , ఆరోగ్యంగా చేస్తుంది. 

జుట్టు పెరుగుదల

మెహందీ, ఉసిరి హెయిర్ ప్యాక్ జుట్టు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తుంది. దీన్ని పెట్టడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదల ఆగిపోయిన వారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

తెల్ల జుట్టు పెరగకుండా 

ఒక్కసారి తెల్లవెంట్రుకలు రావడం మొదలైదంటే జుట్టు మొత్తం తెల్లగా అయ్యేవరకు తెల్ల వెంట్రుకలు వస్తూనే ఉంటాయి. జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి మీరు ఉసిరి, మెహందీ ప్యాక్ ను వాడండి. ఇధి మీకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది నల్ల జుట్టు తెల్లగా మారకుండా చేస్తుంది. 

click me!