వోట్మీల్ మాస్క్ ఎలా తయారు చేయాలి?
ఓట్ మీల్ ఫేస్ మాస్క్ కోసం కావలసినవి:
1/2 కప్పు వోట్స్
తేనె 2 టేబుల్ స్పూన్లు
పెరుగు 1 టేబుల్ స్పూన్
1 టేబుల్ స్పూన్ పాలు
వోట్మీల్ మాస్క్ తయారీ విధానం..
స్టెప్ 1: ఒక గిన్నెలో, ఓట్స్, తేనె, పెరుగు , పాలు బాగా పేస్ట్‌గా మారే వరకు కలపాలి.
స్టెప్ 2: ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, సర్క్యులర్ మోషన్‌లో సున్నితంగా మసాజ్ చేయండి.
దశ 3: ఈ మాస్క్‌ను 15 లేదా 20 నిమిషాలు ఆరనివ్వండి.
దశ 4: 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి, మీ చర్మాన్ని పొడిగా ఉంచండి.
ఇలా చేయడం వల్ల.. మీ ఫేస్ లో గ్లో చాలా తక్కువ సమయంలోనే కనపడుతుంది. ఉదయంపూట ఇలా రాస్తే.. రాత్రికి ముఖం లో గ్లో స్పష్టంగా కనపడుతుంది.