వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్ తో ఏమేమి చేయొచ్చో తెలుసా?

First Published | Apr 12, 2024, 2:11 PM IST

వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను డస్ట్ బిన్ లో వేస్తుంటాం. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ వాడిన గ్రీన్ టీ బ్యాగులతో మీరు ఎన్నో పనులు చేయొచ్చు. అసలు వీటిని దేని కోసం ఉపయోగించాలో తెలుసా? 
 

గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీ బ్యాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. చాలా మంది దీన్ని బరువు తగ్గడానికి ఉపయోగిస్తుంటారు. గ్రీన్ టీ బ్యాగ్ ను వేడి నీటిలో ముంచి కాసేపు ఉంచి తర్వాత పారేస్తుంటాం. కానీ ఈ బ్యాగులో ఉన్న గ్రీన్ టీతో మీరు ఎన్నో పనులు చేయొచ్చు. క్లీనింగ్ చేయడానికి, వాసన పోగొట్టడానికి ఇలా గ్రీన్ టీని ఉపయోగించుకోవచ్చు. మిగిలిన గ్రీన్ టీలో ఏమేమి చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అల్మారాలోని తేమను తొలగించడానికి..

గ్రీన్ టీ బ్యాగ్ ను మీరు ఉపయోగించిన తర్వాత ప్యాకెట్ లోపల ఉన్న గ్రీన్ టీని పారేయకుండా బయటకు తీయండి. దీనిని ఎండలో ఆరబెట్టండి. ఈ ఎండిన గ్రీన్ టీని అల్మారాలో వేయండి. అలా చేయడం వల్ల అల్మారా నుంచి ఎలాంటి చెడు వాసన రాదు. 
 

Latest Videos


మొక్కలకు ఉపయోగం

గ్రీన్ టీ బ్యాగులను పారేయడానికి బదులుగా మీరు దీన్ని మొక్కలకు ఉపయోగించొచ్చు. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్ ను కట్ చేసి దాని లోపలి గ్రీన్ టీని మట్టిలో వేసి బాగా కలపండి. దీనితో పాటుగా మీరు దీనిని కంపోస్టులో కూడా కలపొచ్చు.
 

ఫ్రిజ్ నుంచి వచ్చే వాసనను..

ఫ్రిజ్ నుంచి చాలా సార్లు దుర్వాసన వస్తుంటుంది. అయితే వాడిన గ్రీన్ టీ బ్యాగులను ఉపయోగించి ఈ వాసన రాకుండా చేయొచ్చు. ఇందుకోసం ముందుగా గ్రీన్ టీని బ్యాగ్ ను కట్ చేసి లోపల ఉన్నదాన్ని ఎండలో ఆరబెట్టండి. ఈ ఆకులను ఒక గిన్నెలో వేసి ఫ్రిజ్ లో పెట్టండి. ఇలా చేస్తే ఫ్రిజ్ నుంచి వచ్చే వాసన తాజా వాసనగా మారుతుంది.
 

నాన్ స్టిక్ పాన్ ని శుభ్రం..

నాన్ స్టిక్ పాన్ లో జిడ్డు పేరుకుపోతే, దానిని శుభ్రం చేయడానికి గ్రీన్ టీని ఉపయోగించండి. జిడ్డును తొలగించడంలో గ్రీన్ టీ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్ ను పాన్ లో వేసి వేడినీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు స్క్రబ్ సహాయంతో క్లీన్ చేయండి. 

click me!