అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ముఖ్యంగా మహిళలు.. తమ వయసు పెరుగుతున్నా తమ అందం తరగకపోగా.. మరింత పెరగాలి అని కోరుకుంటారు. తమ అందాన్ని పెంచుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కేజీలకు కేజీల మేకప్ లు వేసుకొని.. అందరి ముందు అందంగా కనిపించేలా తయారౌతారు.
కానీ.. మేకప్ లేకుండా కూడా మనం అందంగా కనిపించొచ్చు. దాని కోసం మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాలి. ముందు మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేయడం వల్ల మనం సహజంగానే అందంగా మెరిసిపోతాం. దానికితోడు.. ఈ కింది టిప్స్ కనుక మనం ఫాలో అయితే... మహిళల అందం రెట్టింపు అవుతుందట. అవేంటో చూద్దాం..
soaked almonds
1.నానపెట్టిన బాదం..
రాత్రిపూట బాదం పప్పు నానపెట్టి.. ఉదయాన్నే వాటిని తినడం అలవాటు చేసుకోవాలి. బాదంపప్పుతో పాటు, ఇతర నట్స్ , రైజిన్స్ ఇలా అన్నింటినీ నానపెట్టి.. తర్వాత.. వాటిని ఉదయాం పూట తినాలి. వీటిని రోజూ తినడం వల్ల.. ముఖంపై నల్ల మచ్చలు, ముడతలు రాకుండా ఉంటాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
2.మంచి నిద్ర..
మనం అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా.. మంచి నిద్ర చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే 8-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. మీకు తగినంత నిద్ర లేనప్పుడు, అది మీ మానసిక స్థితి, జీర్ణక్రియ , చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే దీని వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల చర్మంపై మొటిమలు రావడం ప్రారంభమవుతాయి.
3.ఒత్తిడికి దూరంగా ఉండాలి..
ఒత్తిడి మన మానసిక , శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి కారణంగా, శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది. దీని వల్ల కూడా ముఖం డల్ గా కనిపిస్తుంది. కాబట్టి.. వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా అవసరం.
skin care
స్కిన్ కేర్ రొటీన్ ..
స్కిన్ కేర్ రొటీన్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ రొటీన్ ని ఇతరులను చూసి కాపీ కొట్ట కూడదు. ఒక్కొక్కరి చర్మం ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి.. మీ స్కిన్ టోన్ ని పట్టి.. మాయిశ్చరైజర్, టోనర్, ఫేస్ వాష్ ని ఎంచుకోవాలి. అప్పుడే మీ చర్మం అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది.