ఈ లక్షణాలు కనిపిస్తే.. శారీ క్యాన్సర్ ఉన్నట్లే..!

First Published Apr 4, 2024, 2:53 PM IST

శారీ కట్టుకుంటే క్యాన్సర్ రావడం ఏంటి.. అని చాలా మందికి సందేహం కలగొచ్చు. చీరతోనే ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే.. దానిని కట్టే విధానంలోనే అసలు సమస్య ఉంది.


చీర.. భారతీయ సంస్కృతికి నిలువెత్తు రూపం. మన దేశంలోని మహిళలు ముఖ్యంగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందినవారు ప్రతిరోజూ చీరలే కట్టుకుంటూ ఉంటారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా అలవాటుగా వస్తున్న సంప్రదాయం. అయితే.. గత కొంతకాలంగా చీరలు కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఈ శారీ క్యాన్సర్ ఏంటి..? ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
 

మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల క్యాన్సర్ల పేర్లు వినే ఉంటాం.కానీ.. ఈ శారీ క్యాన్సర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శారీ కట్టుకుంటే క్యాన్సర్ రావడం ఏంటి.. అని చాలా మందికి సందేహం కలగొచ్చు. చీరతోనే ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే.. దానిని కట్టే విధానంలోనే అసలు సమస్య ఉంది.
 

మనం చీర ఎలా కడతాం.. ముందు నడుము దగ్గర నుంచి బిగించి కట్టేస్తాం. అక్కడే వచ్చింది చిక్కంతా.. అలా నడుము చుట్టూ గట్టిగా కట్టుకోవడం వల్ల ,అది కూడా రెగ్యులర్ గా కట్టుకోవడం వల్ల అదే ప్లేస్ లో  పునరావృత ఘర్షణ వల్ల చీర క్యాన్సర్‌కు కారణమని  నిపుణులు చెబుతున్నారు.
 

2020లో దక్షిణ భారతదేశంలో ఓ 40ఏళ్ల మహిళకు ఈ క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. నడుము వద్ద క్యాన్సర్ గడ్డ మొలిసింది. మొదట అది 
. 4×2 సెం.మీ. వద్ద మొదలై.. తర్వాత ర్వాత పెరుగుతూ కనిపించిందట. 

చీర క్యాన్సర్  ప్రాబల్యం కేవలం ఫాబ్రిక్ చర్మానికి రాపిడి అవ్వడం వల్లే  జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  ప్రాంతీయ పరిశుభ్రత పద్ధతులు, వాతావరణ పరిస్థితుల కారణంగా, బీహార్ , జార్ఖండ్ వంటి కొన్ని ప్రాంతాలు ఈ క్యాన్సర్ సంభవనీయతను ఎక్కువగా నివేదించాయి.తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం చర్మం చికాకును పెంచుతుంది, దీని వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుదట.
 

ఈ శారీ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. నడుము చీర చుట్టుకునే ప్రాంతంలో ఎక్కువగా దురద వస్తూ ఉంటుంది. అంతేకాదు.. ఆ ప్రాంతంలో పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు కాస్త జాగ్రత్తపడటం మంచిదే.

కేవలం. చీరలకు మాత్రమే క్యాన్సర్ రావడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కేవలం చీర మాత్రమే కాదు.. భారతదేశం దుస్తులు-సంబంధిత చర్మ ప్రాణాంతకతలను కలిగి ఉంది, ప్రతి ఒక్కటి విభిన్న సాంస్కృతిక పద్ధతులలో పాతుకుపోయింది. కాశ్మీర్‌లో, వెచ్చదనం కోసం కాంగ్రీస్ వేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా.. అక్కడి వారికి కాంగ్రీస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. 

అంతేకాకుండా, ఆరోగ్యంపై దుస్తులు ప్రభావం లింగ సరిహద్దులను అధిగమించింది. జీన్స్‌తో సహా బిగుతుగా ఉండే వస్త్రధారణ పురుషులకు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని, వృషణ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. చర్మం గుర్తులు, ఎరుపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్రమత్తవ్వాలి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు,

click me!