ఈ రోజుల్లో అమ్మాయిలకు మేకప్ వేసుకోవడం అనేది చాలా నార్మల్ గా మారిందని చెప్పొచ్చు. ఒకప్పుడు సినిమాల్లో నటించే నటీ నటులు మాత్రమే మేకప్ మీద ఆధారపడేవారు. ఇప్పుడు నార్మల్ అమ్మాయిలు కూడా వేలకు వేలు వెచ్చించి మరీ క్రీములు కొనేసి ముఖాలకు పూసేస్తున్నారు. ఏదైనా అకేషన్ ఉండి.. ఈ మేకప్ వేసుకుంటే పర్లేదు. కానీ... ప్రతిరోజూ, ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా మేకప్ ఉండాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఈ మేకప్ మొత్తంలో కామన్ గా అందరూ వాడేది లిప్ స్టిక్.
అసలు పెదాలకు లిప్ స్టిక్ రాయకుండా.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టేవాళ్లే కనిపించడం లేదు. ఆ లిప్ స్టిక్ రాసుకుంటే.. మన పెదాల రంగు ఎలా ఉన్నా.. అవి మాత్రం మనకు నచ్చిన రంగులో చూపిచేస్తాయి. అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఈ లిప్ స్టిక్స్ రాసుకోవడం వల్ల.. మీరు తెలీకుండానే కొన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారంటే నమ్ముతారా..?
ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు రాసుకుంటే పర్లేదు. కానీ...రోజూ రాసుకుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. లిప్ స్టిక్ రాసినప్పుడు మన పెదాలు అందంగానే కనపడతాయి కానీ.. దానిలో ఉండే కార్సినోజెనిక్ ప్రాపర్టీలు.. రాను రాను మన చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి.
దాదాపు కాస్మెటిక్ కంపెనీలన్నీ.. తమ ప్రొడక్ట్ తయారు చేసినప్పటి నుంచి..దానిని మార్కెట్ లో విడుదల చేసే ముందు.. చాలా టెస్టులు చేస్తారు. దాదాపు ఎలాంటి అలర్జీ సమస్యలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. కానీ.. కొన్నిసార్లు.. లిప్ స్టిక్స్ వాడటం వల్ల.. చాలా రకాల అలెర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మనం అనుకుంటాం.. లిప్ స్టిక్ తో మన పెదాలు ఎర్రగా మారిపోయాయి అని సంబరపడిపోతూ ఉంటాం. కానీ... ఆ లిప్ స్టిక్ ని ఎక్కువగా వాడుతూ ఉండటం వల్ల,...మన పెదాలు సహజం అందం కోల్పోయి...నిర్జీవంగా మారిపోతాయి. అంతేకాదు.. మన పెదాలపై పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. దాని వల్ల నల్లగా మారిపోతాయి.
చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే... లిప్ స్టిక్స్ వాడటం వల్ల.. పెదాలు నల్లగా మారడం , పిగ్మెంటేషన్ రావడం మాత్రమే కాదు.. మన ఆర్గాన్స్ కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. చాలా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. లిప్ స్టిక్స్ లో వాడే.. పదార్థాలే అందుకు కారణం కావడం గమనార్హం.
ఇక... రోజూ లిప్ స్టిక్ వాడటం వల్ల.. మీ పెదాలు తరచుగా డ్రైగా మారిపోవడం, పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సహజంగా మన పెదాల్లో ఉండే ఆయిల్స్ అన్నీ పోయి.. నిర్జీవంగా మారిపోతూ ఉంటాయి. అందుకే.. ఇలాంటి సమస్యలు పెద్దవి కాకముందే.. లిప్ స్టిక్స్ ఆపేసి.. దాని స్థానంలో.. పెదాలను మాయిశ్చరై.జ్డ్ గా ఉంచే.. లిప్ బామ్స్ రాయడం ఉత్తమం.
లిప్ స్టిక్స్ తాయరు చేసే క్రమంలో వాటిలో పలు రకాల కెమికల్స్, ప్రిసర్వేటివ్స్ వాడుతూ ఉంటారు. దీంతో.. అవి వాడటం వల్ల... గురక, రెస్పిరేటరీ ఇష్యూస్, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతెందుకు... లిప్ స్టిక్స్ వల్ల.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పుష్టిగా ఉంది. కాబట్టి... వీలైనంత వరకు ఎంత తక్కువగా వాడితే అంత మీ ఆరోగ్యానికే మంచిది.