ఇంట్లోనే ఈజీగా ఫేస్ వాష్ లు.. ఒక్కసారి వాడితే వదిలిపెట్టరు...

First Published | Jun 23, 2021, 1:21 PM IST

ఫేస్ వాష్ లకు బదులుగా వంటింట్లో కొన్ని మిశ్రమాలతో తేలిగ్గా ఫేస్ వాష్ తయారు చేసుకోవచ్చు. 

ముఖ సౌందర్యానికి హాని కలిగించే సబ్బులు కాకుండా.. తేలికగా, హాయిగా ఉండే ఫేస్ వాష్ లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే తరచుగా ఫేస్ వాష్ అయిపోతుంటుంది. సడెన్ గా ట్యూబ్ ఖాళీ అయిందని చూసుకుని నిరాశ పడుతుంటారు.
undefined
ఇప్పుడెలా? అని కాస్త కంగారూ మామూలే.. అయితే ...ఫేస్ వాష్ లకు బదులుగా వంటింట్లో కొన్ని మిశ్రమాలతో తేలిగ్గా ఫేస్ వాష్ తయారు చేసుకోవచ్చు.
undefined

Latest Videos


పెరుగు - తేనె ఫేస్ వాష్ : రెండు చెంచాల పెరుగు, ఒక చెంచా తేనెలను ఓ గిన్నెలో తీసుకుని బాగా కలిపి.. మొహానికి అప్లై చేయాలి. పదినిమిషాల తరువాత పూర్తిగా ఎండిపోకముందే మొహాన్ని కడిగేయాలి.
undefined
ఆఫిల్ గుజ్జు - నిమ్మరసం ఫేస్ వాష్ : ఆపిల్ గుజ్జు, నిమ్మరసాన్ని ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి పెట్టకుని మెల్లగా మర్ధనా చేయాలి. కాసేపటి తరువాత కడిగేయాలి.
undefined
స్ట్రాబెర్రీ ఫేస్ వాష్ : రెండు స్ట్రాబెర్రీలు, రెండు చెంచాల పెరుగు తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి పట్టించి.. మూడు నిమిషాల తరువాత కడిగేయాలి.
undefined
పాలు - తేనె ఫేస్ వాష్ : రెండు చెంచాల పచ్చిపాలు, ఒక చెంచా తేనెలను తీసుకుని రెండింటినీ బాగ కలపాలి. తరువాత దీన్ని మొహానికి రాసుకుని 5 నిమిషాల తరువాత కడిగేయాలి.
undefined
పాలు - తేనె ఫేస్ వాష్ : రెండు చెంచాల పచ్చిపాలు, ఒక చెంచా తేనెలను తీసుకుని రెండింటినీ బాగ కలపాలి. తరువాత దీన్ని మొహానికి రాసుకుని 5 నిమిషాల తరువాత కడిగేయాలి.
undefined
పైనాపిల్ ఫేస్ వాష్ : రెండు చెంచాల పైనాపిల్ గుజ్జు, రెండు చెంచాల నిమ్మరసం ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని ఐదునిమిషాల పాటు వదిలేయాలి. ఆ తరువాత మొహాన్ని కడుక్కోవాలి.
undefined
కోడిగుడ్డు-తేనె ఫేస్ వాష్ : ఒక గుడ్డు పచ్చసొన, ఒక చెంచా తేనెలను ఓ గిన్నెలో తీసుకుని బాగా గిలకొట్టాలి. తరువాత దీన్ని మొహానికి రాసుకోవాలి. ఎండిపోవడం మొదలవగానే కడిగేయాలి.
undefined
click me!