దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దంతాలు అలా తెల్లగా ఉంటే మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనస్ఫూర్తిగా నవ్వగలుగుతాము. అయితే.. ఆ దంతాలు అందంగా మెరవాలంటే.. కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే చాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
దంతాలు తెల్లగా ఉన్నాయి అంటే.. మనం ఆరోగ్యంగా ఉన్నామని అర్థమట. అయితే.. పసుపు రంగులో ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా లేవు అని కాదు.. కానీ.. ఆ పసుపు మరకలు పోవడానికి ఎక్కువగా శుభ్రం చేస్తూ ఉండాలి. అలా కాకుండా.. దంతాలు.. గోధుమ రంగులోకి.. లేదా నలుపు రంగులోకి మారాయి అంటే మాత్రం ఆ దంతాలు పాడౌతున్నాయని అర్థమట. దంతాలు అలా మారిపోతే.. కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
దంతాలు తెల్లగా ఉన్నాయి అంటే.. వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందట. తెల్లగా దంతాలు ఉంటే.. వారు నవ్వడానికి ఎలాంటి సంకోచం చెందరు. కాబట్టి.. వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎదుటివారు ఏమనుకుంటారనే భయం లేకుండా.. పళ్లను దాచాలని అనుకోరట.
చాలా మంది చెబుతుంటారు.. మేము రోజూ శుభ్రంగానే బ్రష్ చేస్తున్నాం. మా టూత్ పేస్ట్ కూడా మంచిదే కానీ.. పళ్లు మాత్రం తెల్లగా ఉండటం లేదు అని.. అయితే.. కొన్ని రకాల హోమ్ రెమిడీస్ ఫాలో అయితే... దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం
1.బేకింగ్ సోడా..దంతాల విషయంలో బేకింగ్ సోడా అద్భుతాలు చేస్తుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలుపుకొని పేస్టులాగా చేసుకోవాలి. దానిని బ్రష్ తో దంతాలు శుభ్రం చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత నోటిని, పళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లపై పేరుకుపోయిన పసుపుదనం పోతుంది. దీంతో.. దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.
2.నిమ్మ తొక్కలు.. నిమ్మలో సహజంగానే బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. కాబట్టి నిమ్మ తొక్కతో పళ్లు శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మ తొక్కతో పళ్లపై రుద్ది.. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. నోరు, దంతాలు రెండు శుభ్రమౌతాయి.
3.కొబ్బరి నూనె.. పళ్లను శుభ్రం చేయడంలో కొబ్బరి నూనె కూడా కీలక రోల్ ప్లే చేస్తుంది. ఒక స్పూన్ కొబ్బరి నూనె నోటిలో పోసుకొని పుక్కిలించాలి. ఐదు నిమిషాలపాటు పుక్కిలించి.. ఆ తర్వాత బ్రష్ తో నోటిని, పళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయి.