పీరియడ్ పెయిన్ తగ్గించే పసుపు...
పీరియడ్ పెయిన్ ని తగ్గించడానికి పసుపు చాలా కీలకంగా పని చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ షమయంలో వచ్చే గర్భాశయ తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు ఎమ్మెనాగోగ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉండే కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవడానికి..పాలల్లో పసుపు కలిపి తీసుకోవచ్చు.ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా నిర్వహిస్తుంది. సంతానోత్పత్తికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.