నేటి కాలంలో ఆడవాళ్లు చర్మ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో చర్మ చికాకు, దురద, చర్మం పొడిబారడం వంటి చర్మ సమస్యలు రావడం సర్వ సాధారణమయిపోయాయి. ఈ సమస్యలకు తోడు కొంతమందికి నుదిటిమీద, బుగ్గలు వంటి ప్రదేశాల్లో వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటాయి. దీనివల్ల ఆడవారి ముఖ సౌందర్యం దెబ్బతింటుంది.
ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించడానికి మార్కెట్ లో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ చాలా మంది ఆడవారు ముఖంపై వెంట్రుకలను తొలగించేందుకు వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేస్తుంటారు. కానీ వీటివల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది.
ఆడవారి ముఖంపై వెంట్రుకలు పెరగడానికి హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సింపుల్, నేచురల్ హోం రెమెడీస్ తో ఫేషియల్ హెయిర్ ను కంట్రోల్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముఖాన్ని శుభ్రంగా చేయడానికి, అందంగా కనిపించేలా చేయడానికి పసుపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.అంతేకాదు ముఖంపై పెరుగుతున్న అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా పసుపు దివ్య ఔషదంలాగ పనిచేస్తుంది. ఈ పసుపు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా సహాయపడుతుంది. అందుకే ముఖంపై ఉన్న వెంట్రుకలను పోగొట్టడానికి పసుపు ఫేస్ మాస్క్ లను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పసుపు, బొప్పాయి మాస్క్:
ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి పసుపు, బొప్పాయి ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ముఖ తేమను పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ పసుపు, బొప్పాయి ఫేస్ ప్యాక్ ను తయారుచేయడం చాలా ఈజీ. ఇందుకోసం బొప్పాయిని తొక్క తీసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు కలిపి ఫేస్ కు పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి పెట్టాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మృదువుగా చేసి వెంట్రుకలను తొలగిస్తుంది.
Facial Hair
శెనగపిండి, పసుపు మాస్క్:
పసుపు,శెనగపిండి ఫేస్ ప్యాక్ కూడా ముఖంపై ఉన్న రోమాలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంి. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి శెనగపిండిలో చిటికెడు పసుపును వేసి కలపండి. అలాగే దీనిలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ గంధం పేస్ట్ ను కూడా వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని కడగండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే ముఖంపై ఉన్న వెంట్రుకల తొలగిపోతాయి.
పసుపు ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు
నేచురల్ గా హెయిర్ రిమూవల్:
పసుపులో జుట్టును సహజంగా తొలగించే లక్షణాలు ఉన్నాయి. దీనని ఎన్నో ఏండ్లుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీన్ని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించినప్పుడు జుట్టు కుదుళ్లను బలహీనంగా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను కూడా ఆపేస్తుంది. ఈ విధంగా మీరు పసుపుతో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించొచ్చు.
మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించడం వల్ల కలిగే చర్మం ఎరుపు, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా కూడా చేస్తుంది. ఈ విధంగా మీరు పసుపుతో మీ చర్మాన్ని మెరిసేలా చేయొచ్చు.