చర్మం అందంగా, మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో ఓసారి చూద్దాం...
1.మాయిశ్చరైజర్...
మాయిశ్చరైజర్ మన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. కాబట్టి... ప్రతిరోజూ ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. స్నానం చేసిన తర్వాత... ముఖానికి తప్పకుండా మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. ఇలా రాయడం వల్ల... చర్మం మృదువుగా మారుతుంది.
2.ఇప్పటి వరకు మీరు ముఖానికి వాడుతున్న ఉత్పత్తులు సరిగా పనిచేయడం లేదు.. చర్మాన్ని మృదువుగా చేయడం లేదు అనిపిస్తే... వాటిని మార్చండి. విటమిన్ ఈ క్రీమ్, జొజోబా ఆయిల్, జెల్ బేస్డ్ క్రీమ్ లాంటి ఉపయోగించడం మొదలుపెట్టాలి.
3.ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా.... ముఖానికి సన్ స్క్రీన రాయడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు యూవీ కిరణాలు ముఖాన్ని దెబ్బతిస్తాయి. కాబట్టి.... సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.
4.మనలో చాలా మంది వేడి నీటి తో స్నానం చేస్తూ ఉంటారు. చలికాలంలో వేడి నీటితో స్నానాన్ని మనం అందరం ఎక్కువగా ఆస్వాదిస్తాం. కానీ... వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం దెబ్బతింటూ ఉంటుంది. చర్మం రఫ్ గా మారుతుంది. అలా కాకుండా చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల... చర్మం మృదువుగా ఉంటుందట. తొందరగా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
5.మనలో చాలా మంది చలికాలంలో చలికి తట్టుకోలేక.... వేడి కోసం హీటర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ... వాటి వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది. పొడిగా మారుతుంది. చర్మంలో తడి తగ్గిపోయి పొడిగా మారుతుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
Beauty Secrets-These women are not happy despite being the most white in the world
6.మంచినీరు మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే మన చర్మం అంత అందంగా ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి చర్మం అందంగా ఉండాలన్నా, మృదువుగా ఉండాలన్నా... నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
7.వీటన్నింటితో పాటు... రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఉండాలి. వ్యాయామం, యోగా లాంటివి కూడా చర్మాన్ని అందంగా మారుస్తాయి. ఇక ఆరోగ్యకరమైన డైట్ కూడా ఫాలో అవ్వాలి. ఇవి కూడా అందాన్ని రెట్టింపు చేస్తాయి.
8.ఇక రెగ్యులర్ గా... స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవుతూ ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవ్వడం వల్ల కూడా చర్మం మృదువుగా మారుతుంది.