మెగా కోడలు లావణ్య ఫిట్నెస్ మంత్ర ఇదే..!

First Published | Feb 9, 2024, 3:50 PM IST

ఆమె అందంలోనూ ఏ మాత్రం తీసిపోదు. అయితే... లావణ్య త్రిపాఠి తన ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఓసారి చూద్దాం..


మెగా కోడలు లావణ్య గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా కోడలు కాకముందే.. లావణ్య అందరికీ సుపరిచితమే. అందాల రాక్షసి సినిమాతో అందరి మనసు దోచేసింది. ఆ తర్వాత ఆమె తెలుగులో హీరోయిన్ గా  చాలా సినిమాలు చేశారు. అయితే.. లావణ్య సినీ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఫిట్నెస్  విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె పర్సనాలిటీ, ఫిజక్ చాలా బాగుంటుంది. ఆమె అందంలోనూ ఏ మాత్రం తీసిపోదు. అయితే... లావణ్య త్రిపాఠి తన ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఓసారి చూద్దాం..

.లావణ్య వర్కౌట్స్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఆమె ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ కి వెళ్తూ ఉంటారట. అప్పర్,లోయర్ రెండూ రకాల వర్కౌట్స్ ని చేస్తూ ఉంటారు. ఒక్క రోజు కూడా జిమ్ స్కిప్ కాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.



2.జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడమే కాకుండా లావణ్య పైలెట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇదొక రకం వ్యాయామం. చాలా కఠినంగా ఉంటాయి. ఈ వ్యాయామం చేయడం వల్ల బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది.


3.ఇవి మాత్రమే కాదు.. ఇన్ని వర్కౌట్స్ చేసినా కూడా తన డైలీ రోటీన్ లో ఆమె డ్యాన్స్ కూడా ఒక భాగం చేసుకున్నారు. రెగ్యులర్ గా డ్యాన్స్ చేయడం వల్ల  బాడీ టోన్ చేయడానికీ.. ఫ్లెక్సిబుల్ గా ఉండటానికి  కూడా సహాయం చేస్తుంది.
 

4.వీటితో పాటు లావణ్య సర్క్యూట్ ట్రైనింగ్  వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారట. అంటే స్క్వాట్స్, జంపింగ్ జాక్స్, పుషప్స్ అలాంటివన్నీ దీనిలోకి వస్తాయి. వీటిని కూడా ఆమె రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. అందుకే.. ఆమె అంత ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు.
 

5. ఎన్ని వ్యాయామాలు చేయడం తో పాటు.. ఆమె ఆహారం విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటారు. లావణ్య పూర్తిగా వెజిటేరియన్.  తన ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. కంప్లీట్ గా ఆరోగ్యకరమైన, న్యూట్రియంట్స్ తో నిండిన ఆహారం తీసుకుంటారు.
 

6.ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలని తెలిసిందే. ఈ ఫార్ములాను లావణ్య స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. షుగర్, ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉంటారు. అయితే.. వారానికి ఒకసారి చీట్ మీల్ చేస్తూ ఉంటారట. కానీ.. దాదాపు జంక్ ఫుడ్ కి మాత్రం దూరంగా ఉంటారు. 
 

ఇక లావణ్య కెరీర్ విషయానికి వస్తే.. ఆమె చాలా జాగ్రత్త గా అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా వెబ్ సిరీస్  ఫ్యామిలీలోకి అడుగుపెట్టారు. మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించారు.ఈ సిరీస్ ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంటోంది. 

Latest Videos

click me!