లిప్ స్టిక్ పెట్టకున్నా పెదాలు అందంగా కనిపించాలంటే ఇలా చేయండి

First Published Dec 17, 2023, 12:36 PM IST

పెదవులే మన ముఖ అందాన్ని మరింత పెంచుతాయి. అయితే వాతావరణంలో మార్పు లేదా శరీరంలో విటమిన్స్ లోపం వల్ల పెదవులు సహజ మెరుపును కోల్పోయి, పొడిబారి నిర్జీవంగా కనిపిస్తాయి. చలికాలంలో కూడా మీ పెదవులు మృదువుగా, అందంగా కనిపించాలంటే మాత్రం ఈ చిట్కాలను ట్రై చేయండి. 

lips

అందంగా కనిపించడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో మన ఆరోగ్యాన్ని పాడు చేసే కెమికల్స్ ఉంటాయి. వీటి వాడకం కంటే సహజ పద్దతులను ఫాలో అవ్వడమే బెటర్. అయితే చాలా మంది శరీరంలోని అన్ని భాగాల్లో ముఖ సంరక్షణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ముఖం అందంగా కనిపించాలంటే కళ్ల అందంతో పాటు ముక్కు, పెదవుల  గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. అయితే వాతావరణంలో వచ్చే మార్పులతో పాటుగా ఇతర కారణాల వల్ల మన పెదాలు నల్లగా మారుతుంటాయి. అయితే మీ పెదాలు ఎర్రగా, అందంగా కనిపించడానికి కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే? 

lips

బాదం నూనె

బాదం నూనెతో కూడా పెదాలను అందంగా, ఆరోగ్యంగా చేయొచ్చు. పెదాలకు బాదం నూనెను అప్లై చేయడం వల్ల పెదవుల డ్రై నెస్ తగ్గుతుంది. దీంతో మీ పెదవులు మునుపటిలా మృదువుగా, అందంగా తయారవుతాయి. ఇందుకోసం రోజూ రాత్రి పడుకునే ముందు 3 నుంచి 4 చుక్కల బాదం నూనెను పెదవులకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి.
 

Latest Videos


బీటురూట్

బీట్ రూట్ కూడా పెదాల అందాన్ని పెంచుతుంది. ఇందుకోసం బీట్ రూట్ ను ముక్కలుగా కట్ చేయండి. వీటిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచిన తర్వాత పెదాలపై ఐదు నిమిషాలపై పెట్టి మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల పెదవులకు నేచురల్ పింక్ గ్లో లభిస్తుంది.
 

తేనె, ఆలివ్ ఆయిల్

పెదవులకు నేచురల్ కలర్ రావాలంటే తేనెలో ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయండి. దీన్ని బాగా కలిపి  పెదాలకు అప్లై చేయండి. ఈ చిట్కాలు మీ పెదాలను మృదువుగా చేస్తుంది.
 

తేనె, నిమ్మకాయ

ముఖం మాదిరిగానే తేనె కలిపిన నిమ్మరసంతో పెదవులకు మసాజ్ చేస్తే పెదవులకు గులాబీ రంగులోకి మారిపోతాయి. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి. 
 

click me!