ప్యాంటుతో స్లిట్ కట్ టాప్
ఆఫీస్ పార్టీలో స్టైల్ గా కనిపించాలంటే మాత్రం మీరు స్లిట్ కట్ టాప్ ప్యాంట్ ను ట్రై చేయొచ్చు. ఈ డ్రెస్సులో మీ లుక్ అదిరిపోతుంది. ఈ రోజుల్లో ఈ రకమైన డ్రస్సులే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అలాగే ఇవి చాలా క్లాసీగా కూడా కనిపిస్తాయి. అందుకే ఈ క్రిస్మస్ పార్టీకి మీరు వీటిని వేసుకోవచ్చు. వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ముఖ్యంగా ఆఫీస్ పార్టీకి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. వీటిలో ఎన్నో రకాల డిజైన్లు ఉంటాయి. మార్కెట్ లో రూ. 1000 నుంచి 2000 వరకు ఇలాంటి కో-బేసి సెట్లు దొరుకుతాయి. ఈ రకమైన డ్రెస్సుల పైకి ముత్యాల చెవిపోగులు, అందమైన నెక్లెస్ సెట్ లను వేసుకుంటే మీ అందానికి ఎవరూ వంక పెట్టరు.