సినిమా రంగం ఓ కలల ప్రపంచం. అందులోకి అడుగుపెట్టడం అంత సులువేమీ కాదు. దాని కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత, తమ టాలెంట్ చూపించి, అభిమానులను సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో స్టార్ కిడ్స్ కాస్త అదృష్టవంతులే. వారు ఈ సినిమా రంగంలోకి అడుగుపెట్టకముందే ఫ్యాన్స్ ఉంటారు. వారి పేరెంట్స్ కి ఉన్న అభిమానులే.. వీరిని కూడా అభిమానించడం మొదలుపెడుతూ ఉంటారు. ఆ తర్వాత వారి నటనతో మరింత మందిని సంపాదించుకుంటారు. అయితే..చాలా మంది ఈ స్టార్ కిడ్స్ కి చదువు సరిగా రాకపోవడం వల్లే.. మళ్లీ సినిమాల్లోకి వచ్చారు అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఈ కింది స్టార్స్ మాత్రం.. నటనలో ఇరగదీస్తున్నా.. చదువు విషయంలోనూ తాము సరస్వతీ దేవి పుత్రులు, పుత్రికలు అని నిరూపించుకున్నారు. బాలీవుడ్ లో బాగా చదువుకున్న స్టార్స్ కిడ్స్ ఎవరో ఓసారి చూద్దాం..