ఇవి మాత్రం మీ ముఖానికి అస్సలు రాయకూడదు..!

First Published Oct 11, 2023, 3:30 PM IST

ముఖ్యంగా వంటింట్లో లభించే వస్తువులను ఉపయోగించి కూడా అందంగా మారిపోతాం అని చాలా మంది చెబుతుంటారు. అయితే,  అన్ని సహజ ఉత్పత్తులను కూడా ముఖానికి ఉపయోగించకూడదట. అవేంటో ఓసారి చూద్దాం..
 

అందంగా ఉండాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో లభించే క్రీములు వాడుతూ ఉంటారు. అయితే, బయట వాడే క్రీముల్లో కెమికల్స్ ఉంటాయి అని,  సహజ ఉత్పత్తులు వాడాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం కొందరు ఇంట్లో, ముఖ్యంగా వంటింట్లో లభించే వస్తువులను ఉపయోగించి కూడా అందంగా మారిపోతాం అని చాలా మంది చెబుతుంటారు. అయితే,  అన్ని సహజ ఉత్పత్తులను కూడా ముఖానికి ఉపయోగించకూడదట. అవేంటో ఓసారి చూద్దాం..

skin care

మనకు కిచెన్ లో లభించే చాలా  వస్తువులను అందం కోసం ముఖానికి అప్లై చేస్తూ ఉంటారు. కానీ, మసాలా దినుసులు చాలా మంది వాడుతుంటారు. కానీ, కొన్నింటిని వాడితే, సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అవేంటో ఓసారి చూద్దాం..


దాల్చిన చెక్క... దాల్చిన చెక్క ని మనం మసాలా దినుసుగా వంటలో వాడుతూ ఉంటాం. కానీ, దీనిని ముఖానికి మాత్రం ఉపయోగించకూడదు. అలా ఉపయోగించడం వల్ల చర్మంపై దురద, ర్యాషెస్, ఇరిటేషన్ లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి, దీనిని ముఖం పై వాడకూడదు.

పాపిరిక.. ఇది కూడా ఒక మసాలా పొడి. దీనిని రెడ్ పెప్పర్ తో తయారు చేస్తారు. దీనిని కూడా ముఖానికి అస్సలు ఉపయోగించకూడదు. స్కిన్ ని సెన్సిటివ్ గా మార్చేస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఆవపిండి... ఆవపిండి వంటల్లో, కూరల్లో రుచిని బాగా పెంచుతోంది. కానీ, ఆవ పిండిని ముఖానికి అస్సలు వాడకూడదు. అలా వాడటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

లవంగాలు.. మన ఇంట్లో లభించే మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. అలాంటి లవంగాలను మసాలా కూరలు, బిర్యానీలలో వాడుతూ ఉంటారు. అయితే, వాటిని చర్మ సౌందర్య సాదనంగా మాత్రం వాడకూడదు. దాని వల్ల  చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మిరియాలు.. మిరియాలను మనం వంటలో మసాలాగా, కారం పెంచుకోవడానికి వాడుతూ ఉంటాం. కానీ, దీనిని కూడా మనం అందాన్ని పెంచుకోవడానికి మాత్రం వినియోగించకూడదు.

అల్లం.. అల్లంలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ముఖానికి రాస్తే మంట మండిపోతుంది. అందాన్ని పెంచుకోవడానికి దీనిని వాడకూడదు.
 

పసుపు.. మనలో చాలా మంది పసుపును ముఖానికి వాడతారు. అందం పెంచుకోవడానికి, ట్యాన్ తొలగించడానికి ఉపయోగిస్తారు. కానీ, ఇది కూడా ఉపయోగించకూడదట. ఎందుకంటే,  ఒక్కసారి పసుపు ముఖానికి రాస్తే, దాని పసుపు తొందరగా ముఖం నుంచి వదలదు. పచ్చగా కనపడుతూ ఉంటుంది.

click me!