పెరుగు కాదు.. తలకు పాలు రాసి చూడండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది..!

First Published | Jun 17, 2024, 10:02 AM IST

చాలా సంవత్సరాలుగా పాలను సౌందర్య సాదనాల్లో వాడుతూ వస్తున్నారు. అయితే.. ముఖం, చర్మం మాత్రమే కాదు.. పాలు.. జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయట. మరి..  ఈ పాలను హెయిర్ కేర్ రొటీన్ లో ఎలా వాడాలో ఓసారి చూద్దాం..

జుట్టు ఆరోగ్యంగా పెరగాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. రోజూ జుట్టు ఊడిపోతుంటే.. తెలియని ఏదో ఒక బెంగ మొదలౌతుంది.  అందుకే.. జుట్టు పెంచుకోవడానికి, రాలడం తగ్గడానికి, చుండ్రు సమస్యకు.. ఇలా రకరకాల సమస్యలకు  రకరాల షాంపూలు, ఆయిల్స్ వాడుతూ ఉంటారు. కానీ.. ఈ ఖరీదైన షాంపూలతో పని లేకుండా...కేవలం పాలను ఉపయోగించి.. మనం ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చంటే మీరు నమ్ముతారా..?

సాధారణంగా.. హెయిర్ మాస్క్ గా చాలా మంది జుట్టుకు పెరుగు పెడుతూ ఉంటారు. కానీ.. పెరుగు కాదు.. పాలను ఉపయోగించి.. జుట్టును హెల్దీగా మార్చుకోవచ్చు. కేవలం పాలతో జుట్టును కడిగితే సరిపోతుంది. ఎందుకు అంటే... పాలల్లో చాలా రకాల న్యూట్రియంట్స్  ఉంటాయి. చాలా సంవత్సరాలుగా పాలను సౌందర్య సాదనాల్లో వాడుతూ వస్తున్నారు. అయితే.. ముఖం, చర్మం మాత్రమే కాదు.. పాలు.. జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయట. మరి..  ఈ పాలను హెయిర్ కేర్ రొటీన్ లో ఎలా వాడాలో ఓసారి చూద్దాం..


పాలు సహజంగానే మంచి కండిషనర్ లా పని చేస్తుంది.  అందుకే.. పాలతో తలను, జుట్టును మంచిగా కడగడం వల్ల.. జుట్టు చాలా స్మూత్ గా, సిల్కీగా, షైనీగా మారుతుంది. పాలల్లో ఉండే ప్రోటీన్స్ ఫ్యాట్స్.. జుట్టును స్మూత్ చేయడానికి సహాయపడతాయట.జుట్టు ఎక్కవగా చిక్కు పడకుండా ఉండటంలో సహాయపడుతుంది. మీకు పాలతో కడిగిన తర్వాత... చాలా తక్కువ సమయంలోనే తేడా స్పష్టంగా తెలుస్తుంది.

hair

పాలల్లో విటమిన్ ఏ, బి6, బయోటిన్, పొటాషియం లాంటి న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ  ఆరోగ్యకరమైన సెబమ్ ప్రొడక్షన్ కి సహాయపడుతుంది. అది... జుట్టు కుదుళ్లు, స్కాల్ప్ మాయిశ్చరైజ్డ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఇక.. పాలల్లో ఉండే బయోటిన్.. జుట్టు బలంగా మార్చడానికి సహాయపడుతుంది. జుట్టు విరిగిపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలు ఉండవు. ఇక పొటాషియం.. జుట్టు మాయిశ్చరైజ్డ్ గా , హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. పాలల్లో ఉంటే ప్రోటీన్స్.. జుట్టు బలంగా, ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఎవరికైనా డాండ్రఫ్ సమస్య ఉన్నా.. పాలతో జుట్టును మంచిగా కడిగి.. ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.


పాలను జుట్టుకి ఎలా వాడాలంటే..

ముందుగా తలస్నానం చేయాలి  ఆ తర్వాత కండిషనర్ లా ఈ పాలను వాడాలి... ఒక కప్పు పాలను తీసుకొని.. జుట్టు కుదుళ్ల నుంచి.. మొదళ్ల వరకు.. మంచిగా తడపాలి. స్కాల్ప్ కి కూడా పాలు మొత్తం మంచిగా తగిలేలా చూసుకోవాలి. మొత్తం మంచిగా పాలు పోసిన తర్వాత... నెమ్మదిగా మసాజ్ చేయడం మొదలుపెట్టాలి. ఆ పాలు.. తలకు బాగా పట్టేలా మసాజ్ చేసిన తర్వాత .. కొద్దిగా వేడి నీటితో..జుట్టును శుభ్రం చేయాలి.
 


హెయిర్ మాస్క్ లా..

పాలల్లో తేనె, కోడి గుడ్డు కలిపి.. హెయిర్ మాస్క్ లా వాడొచ్చు.  ఈ మూడింటిని బాగా కలిపి... జుట్టు, కుదుళ్లకు బాగా పట్టించాలి. ఒక అరగంటపాటు అలానే వదిలేయాలి. తర్వాత... షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. మీ జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టినట్లే. 

Latest Videos

click me!