బొడ్డులో కొన్ని చుక్కల ఈ నూనె వేస్తే.. మీ ముఖం, స్కిన్ మెరిసిపోద్ది

First Published | Jan 11, 2025, 4:10 PM IST

అందమైన, కాంతివంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకు ఒక నూనె బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఒక నూనెను బొడ్డులో రెండు చుక్కలు వేస్తే మీ చర్మం కాంతివంతంగా మారిపోతుంది.

belly button

ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ రోజుల్లో చాలా మందికి ముఖం, చర్మంపై నల్ల మచ్చలు, డార్క్ నెస్, డల్ స్కిన్, డార్క్ సర్కిల్స్ వంటి ఎన్నో చర్మ సమస్యలతో బాధపడుతున్నారు.  క్లియర్ స్కిన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది.

దీని కోసం చాలా మంది హానికరమైన కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. లేదా పార్లర్లకి వెళుతున్నారు. కానీ ఒక చిట్కా పాటిస్తే మాత్రం మీరు పార్లర్ కి వెళ్లకుండానే క్లియర్ స్కిన్ ను పొందుతారు. అదేంటో కాదు బొడ్డులో నూనె వేయడమే. అవును బొడ్డులో నూనె వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య, చర్మ ప్రయోజనాలను పొందుతారు. నాభిలో నూనెను వేయడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా, కాంతివంతంగా, క్లియర్ గా ఉంటుంది. 

belly button

బొడ్డులో ఏ నూనె వేయాలి?

టీ ట్రీ ఆయిల్ 

టీ ట్రీ ఆయిల్ బెస్ట్ ఆప్షన్. బొడ్డులో కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ ను వేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ టీ ట్రీ ఆయిల్ లో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ముఖంపై మొటిమలు లేకుండా చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 


belly button

నాభి ప్రాముఖ్యత

మన శరీరంలో ఉన్న ముఖ్యమైన భాగాల్లో నాభి ఒకటి. ఇది చర్మాన్ని, శరీరంలోని వివిధ భాగాలను పోషించడానికి సహాయపడుతుంది. మనం గనుక బొడ్డులో కొన్ని చుక్కల నూనెను వేయడం వల్ల చర్మం, ఆరోగ్యం పై మంచి ప్రభావం పడుతుంది. అయితే దీని ప్రభావం చాలా తొందరగా, లోతుగా ఉంటుంది. 

చర్మానికి టీ ట్రీ ఆయిల్ 

టీ ట్రీ ఆయిల్ ను బొడ్డులో కొన్ని చుక్కలు వేయడం వల్ల శరీరంలో దానిని శోషించుకుని చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే చర్మ ధూళి, బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. దీంతో మీ చర్మం లోతుగా  శుభ్రపడుతుంది. ఇది మీ చర్మాన్ని క్లియర్ గా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. 
 

belly button

బొడ్డులో టీ ట్రీ ఆయిల్ ను ఎలా వేయాలి? 

అయితే ఈ టీ ట్రీ ఆయిల్ ను నేరుగా బొడ్డులో వేయకూడదు. చర్మానికి రాయకూడదు. ఎప్పుడైనా సరే దీనిని కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో కలిపి ఉపయోగించాలి. దీనిని చేతులతో నాభికి అప్లై చేయాలి. దీన్నిరాత్రంతా అలాగే ఉంచాలి. అప్పుడే ఇది బాగా పనిచేస్తుంది. 

చర్మంపై టీ ట్రీ  ఆయిల్ ప్రభావం

బొడ్డులో టీ ట్రీ ఆయిల్ ను ప్రతిరోజూ వేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చర్మంపై ఉన్న మరకలు, మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే మీ ముఖం రంగు కూడా మెరుగుపడుతుంది. మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది. 

టీ ట్రీ ఆయిల్ ఇతర ప్రయోజనాలు

ఈ టీ ట్రీ ఆయిల్ మన చర్మాన్ని లోతుగా శుభ్రపరచడమే కాకుండా.. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిని వాడితే చర్మ సంక్రమణ ప్రమాదం కూడా తప్పుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

టీ ట్రీ  ఆయిల్ తో జాగ్రత్తలు

ఏదేమైనా ఈ టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగిస్తున్నప్పుడు.. దీనిని నేరుగా ఉపయోగించకూడదు. అలాగే దీనిని ఉపయోగించే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ ప్యాచ్ టెస్ట్ తో టీ ట్రీ ఆయిల్ మీ చర్మానికి మంచిదా? కాదా?  అని  తెలుస్తుంది.
 

Latest Videos

click me!