టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, కన్నడ భాషలతో పాటు నార్త్ లోనూ అలరించింది. ఆమె తన సినీ కెరీర్ మొదలుపెట్టి దాదాపు 15ఏళ్లు దాటింది. కానీ ఆమె మాత్రం తన కెరీర్ ని దిగ్విజయంగా కంటిన్యూ చేస్తోంది. రీసెంట్ గా యూత్ ని ఆకట్టుకునేలా వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. తన కెరీర్ లో ఎప్పుడూ చేయని బోల్డ్ సీన్స్ కూడా తమన్నా ఈ వెబ్ సిరీస్ లలో చేయడం విశేషం.
ఈ సంగతి పక్కన పెడితే.. తమన్నా వయసు పెరుగుతున్నా అందం పెరుగోతోందే తప్ప, తరగడం లేదు అనే చెప్పాలి. ఆమె అందంలో జుట్టు కూడా ప్రధానంగా చెప్పొచ్చు. తమన్నా తన హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. మరి ఆ జాగ్రత్తలేంటో , హెయిర్ కేర్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తన జుట్టు ఊడిపోకుండా.. ఆరోగ్యకరంగా పెరిగేందుకు తమన్నా ఉల్లిపాయ రసం వాడతారట. ఉల్లిపాయ రసంలో కొబ్బరి నూనె కలిపి.. తన జుట్టు కుదుళ్లకు బాగా పట్టిస్తారట. వారానికి ఒకసారి ఇలా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందట.
Tamannah Bhatia
హీరోయిన్లు షూటింగ్స్ కోసం ఏవేవోక్రీములు, హెయిర్ స్టైల్స్ కోసం ఏవేవో అప్లై చేస్తూ ఉంటారు. వీటి వల్ల జుట్టు కొన్నాళ్లకు పాడైపోతూ ఉంటుంది. అయితే.. అలా జరగకుండా ఉండేందుకు తమన్నా తన హెయిర్ ని వారానికి ఒకసారి హెర్బల్ వాష్ చేయిస్తుందట. కెమికల్స్ లేకుండా సహజ ఉత్పత్తులు అంటే.. షీకాకాయ, ఆమ్లా లాంటివి వాడుతూ ఉంటారట.
tamannah
దాదాపు హీరోయిన్లు అందరూ హీట్ స్టైలింగ్స్ చేపిస్తూ ఉంటారు. కానీ.. తమన్నా మాత్రం వాటికి వ్యతిరేకట. చాలా తక్కువగా హీట్ స్టైలింగ్స్ చేపిస్తూ ఉంటారట. దాని వల్ల కూడా ఆమె జుట్టు పాడవ్వకుండా ఉంటుంది.
Tamannaah
ఇక, షాంపూలు, ఆయిల్స్, కండిషనర్ లాంటి వాటికి కూడా కెమికల్స్ ఉన్నవి కాకుండా.. ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకుంటారట. కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వల్ల.. జుట్టు ఎక్కువగా పాడవ్వకుండా ఉంటుంది.
Tamannah Bhatia
పై పై జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. ఫుడ్ రూపంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే.. జట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బ్యాలెన్స్డడ్ డైట్ కూడా తీసుకోవాలి.విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తమన్నా ఈ విషయంలో కచ్చితంగా ఉంటారట. తన ఆరోగ్యంతోపాటు.. జుట్టు కూడా హెల్దీగా ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకుంటారట.
Tamannah bhatia
అంతేకాకుండా.. తమన్నా వారానికి ఒకసారి అయినా.. ఆయిల్ తో మంచిగా మసాజ్ చేస్తారట. స్కాల్ప్ దగ్గర ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాదు.. మంచి రక్త ప్రసరణ జరిగి.. జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.