పెళ్లికి ముందు ఆడవాళ్లకు అమ్మానాన్నలే అన్ని. పెళ్లి తర్వాత అమ్మానాన్నలు చుట్టాల్లా మారితే.. అత్తామామలే అమ్మానాన్నలు అవుతారు. అయితే పెళ్లి తర్వాత ఉద్యోగాల పేరిట చాలా మంది ఆడవారు అత్తామామలకు దూరంగా ఉంటారు. కానీ ఇది ఆడవాళ్ల ఆ రోగ్యానికి అస్సలు మంచిది కాదని ఓ తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. అవును ఒక అధ్యయనం ప్రకారం.. అత్తమామలు లేదా తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఆడవాళ్లకు డిప్రెషన్ ప్రమాదం తగ్గుతుందని తేలింది.
postpartum depression
తల్లిదండ్రులు 70 ఏండ్ల లోపు వారైతే.. అలాగే వారికి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలేం లేకపోతే, కొత్తగా తల్లులైన ఆడవారు యాంటీ డిప్రెసెంట్ మందులను వాడే అవకాశం చాలా తక్కువని ఫిన్లాండ్ లోని హెల్సింకి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నినా మెత్స-సిమోలా చెప్పారు.
నిరాశను నివారించడానికి..
2000-2014 మధ్య ఫిన్లాండ్ లో 4.88 లక్షల మంది చిన్న పిల్లల తల్లులను పరిశోధకులు పర్యవేక్షించారు. కొత్త తల్లులను చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అని కూడా పరిశోధన జరిగింది.
postpartum depression
వీటితో పాటుగా తల్లిదండ్రులు, తాతలు, అత్తమామల వయస్సు, వారి ఆరోగ్యం, కొత్త తల్లులతో దూరం కూడా ఈ అధ్యయనంలో చేర్చారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల్లో.. నిరాశ, డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఒకరికొకరు మద్దతునివ్వడం, మాట్లాడుకోవడం చాలా అవసరం అని డాక్టర్ మెట్సా-సిమోలా చెప్పారు.
Postpartum Depression
డెలివరీ తర్వాత డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉన్న మహిళలు
భర్త నుంచి విడిపోయిన ఆడవారు యాంటీ డిప్రెసెంట్ మందులను ఎక్కువగా వాడుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. డెలివరీ తర్వాత ఆడవారిలో డిప్రెషన్ అనేది సర్వసాధారణమైన సమస్య అని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆడవారిలో ఇది చాలా కాలంగా కనిపించినప్పటికీ దీన్ని అలాగే వదిలేస్తున్నారు. కానీ దీనికి శ్రద్ధ చాలా చాలా అవసరం.