భార్యలకు సుధామూర్తి బెస్ట్ సజెషన్..!

First Published | Jul 18, 2023, 3:48 PM IST

ఆ రోజు ఆమె  తన భర్తకు 10,000 రూపాయలు ఇచ్చారు. అదే పదివేల తో వారు ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫోసిస్ కంపెనీని ప్రారంభించి, ఈ స్థాయికి తీసుకువచ్చారు.
 


భార్యాభర్తల సంబంధం ప్రేమ-విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. వివాహం తర్వాత ప్రతి వ్యక్తి  మొదటి ధర్మం ప్రతి సందర్భంలో తన భాగస్వామికి అండగా నిలవడం. సంతోషం  విచారంలో మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడంతో పాటు, వారికి సహాయం చేయడం చాలా అవసరంభార్యాభర్తలిద్దరూ కలిసి మెలిసి ఉంటే దాంపత్య జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. కాగా, ఈ విషయంలో హౌస్ వైఫ్స్ కి తాజాగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి ఓ ముఖ్యమైన సలహా ఇచ్చారు.


ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు సుధా మూర్తి, ఎన్ఆర్ నారాయణ మూర్తి వైవాహిక జీవితం గురించి మీరందరూ వినే ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా వారు తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా ఎలా సాగించగలిగారో తెలుసుకుందాం.
 

Latest Videos



సుధా మూర్తికి నారాయణ మూర్తితో పెళ్లైన సమయంలో వారి దగ్గర ఎలాంటి డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నారాయణ మూర్తి గారు సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలని అనుకున్నారట. ఆ మాట విని మొదట సుధామూర్తి భయపడ్డారట. కానీ, ఆ రోజు ఆమె  తన భర్తకు 10,000 రూపాయలు ఇచ్చారు. అదే పదివేల తో వారు ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫోసిస్ కంపెనీని ప్రారంభించి, ఈ స్థాయికి తీసుకువచ్చారు.
 

Puneeth Parva Sudha murthy


ఇన్ఫోసిస్ ఎలా మొదలైంది?: నారాయణమూర్తి 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు.అప్పుడు సుధా మూర్తి, నారాయణమూర్తి ముంబైలోని బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఒకరోజు నారాయణ మూర్తి సుధా మూర్తి దగ్గరకు వచ్చి నా సహోద్యోగితో కలిసి సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలని ప్లాన్ చేసానని చెప్పాడు.
 

మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుధా మూర్తి తన భర్తకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనేది మొదటి ప్రశ్న. దీని తరువాత, నారాయణ మూర్తి భారతదేశానికి సాఫ్ట్‌వేర్ విప్లవం అవసరమని పెద్ద ప్రసంగం చేశారట. దీని తర్వాత సుధా మూర్తి, సరే ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగారంట, దానికి నారాయణ మూర్తి వచ్చే మూడు సంవత్సరాలు ఇంటి ఖర్చులన్నీ నువ్వు భరించాలి. నన్ను కూడా ఆదుకోవాలి అని అడిగారంట.

నారాయణమూర్తి సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించడం గురించి మాట్లాడినప్పుడు, అతని వద్ద డబ్బు లేదు. ఇందుకోసం భార్య సుధా మూర్తి సహాయం తీసుకున్నాడు. అప్పుడప్పుడు ఆయన ఖర్చుల కోసం కొన్ని డబ్బులు ఇవ్వగా, ఆమె వాటిని ఎప్పుడూ పక్కన పెట్టి దాచుతూ ఉండేదట. ఆ సలహా తనకు పెళ్లైన కొత్తలో వాళ్ల అమ్మగారు చెప్పారట. దానిని ఆమె ఫాలో అవుతూ వచ్చారు.
 

అలా దాచిన డబ్బును దాదాపు రూ.పదివేలను ఆమె తన భర్తకు ఇవ్వడం విశేషం. ఆమె దగ్గర పదివేల రెండు వందల యాభై రూపాయలు ఉంటే, వాటిలో అతనికి పదివేలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.250 ఆమె మళ్లీ దాచిపెట్టారట. ఈ విషయం గురించి ప్రస్తావించిన ఆమె, ఇంట్లో భార్యమణులకు సలహా ఇచ్చారు.


అత్యవసర పరిస్థితుల ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. కాబట్టి. ఇంట్లో వచ్చే ఆదాయంలో కొంత డబ్బు పక్కన పెట్టుకోవాలని, వాటిని  అత్యవసరం వచ్చినప్పుడు తప్ప, తీయకూడదని ఆమె సలహా ఇవ్వడం విశేషం. ఆ రోజు తాను అలా చేయడం వల్లే, ఈ రోజు ఇలా ఉన్నామని ఆమె చెప్పారు.
 

click me!