Steaming: ముఖానికి ఐదు నిమిషాలు ఆవిరి పడితే ఏమౌతుంది?

Published : Feb 11, 2025, 10:50 AM IST

 ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాలు ముఖానికి ఆవిరి పడితే ఏం జరుగుతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...  

PREV
13
Steaming: ముఖానికి ఐదు నిమిషాలు ఆవిరి పడితే ఏమౌతుంది?

చాలా మంది తమకు బాగా జలుబు చేసిన సమయంలో ముఖానికి ఆవిరి పడుతూ ఉంటారు. అలా చేస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. కానీ, ఇదే ఆవిరి పట్టడం వల్ల జలుబు తగ్గడమే కాదు.. మన ముఖ సౌందర్యాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది. స్కిన్ కేర్ లో భాగగా క్లెన్సింగ్, ఎక్స్ ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం ఎంత ముఖ్యమో... ముఖానికి ఆవిరిపట్టడం కూడా అంతే ముఖ్యం. మరి, ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాలు ముఖానికి ఆవిరి పడితే ఏం జరుగుతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

23

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనాలు...

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. చర్మం మృదువుగా, అందంగా కనపడేలా చేస్తుంది. ఆవిరి ముఖంపై ఉన్న రంథ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాదు.. ముఖంపై పేర్కొన్న మురికి, నూనెలు తొలగిపోయి..ముఖం ఫ్రెష్ గా కనపడేలా చేస్తుంది. అంతేకాదు.. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగ్గా జరిగేలా చేస్తుంది. ఇది మీ చర్మానికి ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన మెరుపును తెస్తుంది.
 

రెగ్యులర్ గా ముఖానికి ఆవిరి పట్టడం వల్ల.. మనం రెగ్యులర్ గా స్కిన్ కి రాసే సీరమ్, మాయిశ్చరైజర్లు.. చర్మానికి మరింత శోషించుకునేలా చేస్తుంది. అవి ప్రభావంతంగా పని చేయడానికి సహాయం చేస్తాయి, 

33


ముఖానికి ఆవిరి పట్టే పద్దతులు...
మీ ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్ లేదా క్లెన్సర్‌తో శుభ్రం చేయడం ద్వారా ప్రారంభించండి. అలా చేయడం వల్ల ఆవిరి మీ ముఖం నుండి మురికి, అదనపు నూనె , డెడ్ స్కిన్ సెల్స్ లను  తొలగించి చర్మం అందంగా కనిపించేలా చేస్తుంది. ఇప్పుడు నీటిని బాగా వేడి చేసి అందులో మీరు టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ వంటి ముఖ్యమైన నూనెలను నీటికి జోడించవచ్చు. ఆ తర్వాత ముఖానికి ఆవిరి పడితే చాలు. ముఖానికి మాత్రమే కాదు.. తలకు నూనెతో మసాజ్ చేసి.. జుట్టుకు కూడా ఆవిరి పడితే సరిపోతుంది.
 

click me!

Recommended Stories