Face Pack:మేకప్ తో పనిలేదు.. బియ్యం పిండిలో ఇవి కలిపి రాస్తే చాలు..!

Published : Feb 08, 2025, 05:00 PM IST

 ముఖానికి సహజమైన ఉత్పత్తులు ముఖ్యంగా బియ్యం పిండిలో కొన్నింటిని కలిపి రాయడం వల్ల  మేకప్ లాంటివి అవసరం లేకపోయినా.. అందంగా, యవ్వనంగా కనిపించవచ్చు. మరి.. అవేంటో చూద్దామా....

PREV
14
Face Pack:మేకప్ తో పనిలేదు.. బియ్యం పిండిలో ఇవి కలిపి రాస్తే చాలు..!

వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా, అందంగా కనిపించాలి అంటే మేకప్ ఉండాల్సిందే అనే భావన చాలా మందిలో ఉంటుంది, కానీ, మనం సరైన ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, హెల్దీ ఫుడ్స్ తినడం  లాంటి చేయడం వల్ల కూడా యవ్వనంగా కనపడొచ్చు. ఇవి కాకుండా..  ముఖానికి సహజమైన ఉత్పత్తులు ముఖ్యంగా బియ్యం పిండిలో కొన్నింటిని కలిపి రాయడం వల్ల  మేకప్ లాంటివి అవసరం లేకపోయినా.. అందంగా, యవ్వనంగా కనిపించవచ్చు. మరి.. అవేంటో చూద్దామా....
 

24

మనం మన ముఖాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా, రెగ్యులర్ గా ముఖాన్ని శుభ్రం చేసుకున్నా కూడా ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి., ఆ మొటిమలు పపోయాయి అనుకునేలోగా బ్లాక్ హెడ్స్ లాంటివి వస్తాయి. ఇలాంటి వాటి వల్ల ముఖం కాంతి కోల్పోతుంది. అందుకే బియ్యం పిండి ఫేస్ ప్యాక్ లను  ప్రయత్నించాలి.

34

మీరు రెండు స్పూన్ల బియ్యం పిండిలో కొద్దిగా నిమ్మరసం, ఒకటిన్నర చెంచాలా గ్రీన్ టీ, ఒక స్పూన్ తేనె ఇవన్నీ కలిపి.. దానిని ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అది కూడా రాత్రి పడుకునే ముందు రాస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. ఈ ప్యాక్ రాసుకొని.. సున్నితంగా ముఖానికి మసాజ్ చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి ముఖం మెరుస్తూ, కాంతి వంతంగా కనపడుతుంది. బ్లాక్ హెడ్స్ కూడా పోయే అవకాశం ఉంది. వరసగా మూడు రోజులు ఈ ఫేస్ ప్యాక్ రాసినా... మంచి ఫలితాలు చూస్తారు.

44

ఈ నాలుగు మీ ముఖాన్ని ఎలా కాంతివంతం చేస్తాయి..?

ఈ నాలుగు పదార్థాలను మనం ఉపయోగించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. బియ్యం పిండి మన చర్మాన్ని శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. ఇది కొంచెం గరుకుగా ఉండటం వలన, ఇది మన ముఖానికి మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది మొండి మచ్చలను కూడా సులభంగా తొలగిస్తుంది. ఇది మన ముఖాన్ని దాని సహజ రంగులోకి తీసుకువస్తుంది.నిమ్మరసంలోని విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మన చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ మన శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ముఖంపై బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తేనె సహాయపడుతుంది. ఇది మంచి క్రిమినాశక మందుగా కూడా పనిచేస్తుంది.
 

click me!

Recommended Stories