బంగారు ఆభరణాలను ఎలా దాచిపెట్టాలో తెలుసా?

First Published | Dec 12, 2023, 3:36 PM IST

ప్రమాదవశాత్తు దానిని కోల్పోతే మీరు రూ.50వేలు తిరిగి పొందగలరు. ఒక్కో కంపెనీకి ఒక్కో నియమం ఉంటుంది. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే, దాంట్లో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.
 


బంగారం అంటే ఇష్టం ఉండనివారు ఎవరూ ఉండరేమో. ముఖ్యంగా మహిళలు.. బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ వస్తే, దానికి కొనాలని ఆశపడేవారు కూడా ఉంటారు. అయితే, బంగారం కొనగానే సరిపోదు. అవి ఎక్కువ కాలం మెరిసేలా, లుక్ కోల్పోకుండా ఉండాలంటే, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం...
 

బంగారు ఆభరణాలను జాగ్రత్తగా దాచిపెట్టకపోతే,, కొన్న కొంతకాలానికే అవి వంకరపోవడం, లేదంటే రాళ్లు లాంటివి ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. అందుకే, వీటిని ఒక పద్దతి ప్రకారం దాచిపెట్టాలి. చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఆభరణాలను పెడుతూ ఉంటారు. కానీ, మీరు వాటిని రోజూ ధరించడం లేదు అంటే, కచ్చితంగా వాటిని కొనుగోలు చేసినప్పుడు వచ్చిన బాక్స్ లేదా పౌచ్ లాంటి వాటిల్లో పెట్టేయాలి. అది కూడా  వాటిని ఏదైనా క్లాత్ లో పెట్టి.. అప్పుడు బాక్స్ లో స్టోర్ చేయడం ఉత్తమం.  అప్పుడు.. వంకరపోవడం , స్టోన్స్ ఊడిపోవడం లాంటి సమస్య రాకుండా ఉంటుంది.

Latest Videos


మీరు కొనుగోలు చేసిన నగలు, బంగారం రికార్డును నిర్వహించండి. అన్ని నగదు రసీదులు , చెల్లింపు వివరాలను ఫైల్ చేయండి. ఈ అభ్యాసం ఆభరణాలపై మీ ఖర్చును ట్రాక్ చేయడమే కాకుండా బీమా క్లెయిమ్ చేయడంపై పన్ను పరిశీలన సందర్భంలోనూ మీకు సహాయపడుతుంది.

విలువైన వాటికి ఇన్సురెన్స్ చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఎదైనా దొంగతనం లేదంటే, ఫైర్ యాక్సిడెంట్స్ లాంటి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో మనం ఊహించలేం. అందుకే, మీరు ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసిన సమయంలో దానికి ఇన్సూరెన్స్ చేయించుకోండి. అయితే.. మొత్తం రాకపోయినా 10శాతం అయినా, మనం రికవరీ చేయించుకోగలుగుతాం. ఉదాహరణకు మీరు మీ దగ్గర ఉదాహరణకు రూ5లక్షల విలువైన బంగారానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే, ప్రమాదవశాత్తు దానిని కోల్పోతే మీరు రూ.50వేలు తిరిగి పొందగలరు. ఒక్కో కంపెనీకి ఒక్కో నియమం ఉంటుంది. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే, దాంట్లో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు.
 

బంగారం ఎప్పుడూ మెరుస్తూ ఉంటే, మీకు మరింత అందాన్ని తీసుకువస్తుంది. అలా అందం తీసుకురావాలి అంటే.. మీరు రెగ్యులర్ గా ఉపయోగించే బంగారు ఆభరణాలను మూడు నెలలకు ఒకసారి అయినా కనీసం శుభ్ర పరుస్తూఉండాలి. ఇక, ఎప్పుడో ఒకసారి అకేషనల్ గా ధరించేవి అయితే.. సంత్సరానికీ లేదంటే.. రెండు సంవత్సరాలకి ఒకసారి శుభ్రపరుస్తూ ఉండాలి.
 

ఇక, చాలా మంది బంగారు ఆభరణాలు కాస్త వంగిపోయినట్లు అనిపిస్తే, వారికి తోచినట్లుగా రిపేర్ చేస్తూ ఉంటారు.  ఇంట్లో ని ఎలక్ట్రిక్ వస్తువులను రిపేర్ చేసినట్లు చేయకూడదు. ఏదైనా తేడా వచ్చింది అంటే, వెంటనే గోల్డ్ షాప్ వద్ద, వాటిని రిపేర్ చేసేవాళ్లు ఉంటారు. మీరు వారిని సంప్రదించి, రిపేర్ చేసుకోవచ్చు. మీ సొంత పైత్యం వాడకూడదు.

ఇక, ఇంట్లోనే ఎక్కువ మొత్తంలో బంగారం పెట్టుకోవడం వల్ల భయం ఎక్కువగా ఉంటూనే ఉంటుంది. అలాంటివారు.. ఇంట్లోనే ఉంచుకోకుండా, బ్యాంక్ లో లాకర్ తీసుకొని.. అందులో పెట్టుకోవచ్చు. లాకర్ ధర రూ.700 నుంచి రూ.3,500 వరకు ఉంటుంది. అందులో  స్టోర్ చేసుకోవడం వల్ల  పోతాయనే భయం ఉండదు. 

click me!