ఇలా అయితే మీ యోని ఆరోగ్యం దెబ్బతిన్నట్టే...!

First Published | Mar 25, 2023, 9:36 AM IST

నిజానికి ఆడవారికి యోని ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యంగా లేకపోతే కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భాశయ క్యానర్ వల్ల కూడా యోని ఆరోగ్యంగా ఉండదంటున్నారు నిపుణులు. 

యోని తనకు తానుగా శుభ్రపరుచుకునే అవయవం. అయితే యోనిని రకరకాల కెమికల్స్ ఉండే వాటితో అసలే క్లీన్ చేయకూడదు. ఎప్పుడైనా సరే జననేంద్రియాలను సాదా సబ్బుతోనే కడగాలి. మిమ్మల్ని మీరు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి తగినంత నీటిని తాగాలి. అప్పుడే శరీరంలోని మలినాలు, సూక్ష్మక్రిములు బయటకు పోతాయి. చెడు వాసన కూడా రాదు. 
 

vaginal infection

అయితే జననేంద్రియాల్లో ఏ భాగంలోనై దురద, గాయం లేదా కాలిపోయిన గుర్తులున్నాయో అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సంకేతాలు మీ యోని ఆరోగ్యంగా లేదని చెప్తాయి. అసలు యోని ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


చేపల వాసన

మీ యోని నుంచి చేపల వాసన వస్తుంటే.. మీ యోని ఆరోగ్యం దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వాగినోసిస్ కు సంకేతం కావొచ్చు. ఇది యోనిలో బ్యాక్టీరియా పెరుగుదల, యోని పీహెచ్ అసమతుల్యత వల్ల వస్తుంది. ఈ చేపల వాసనతో పాటుగా ఉత్సర్గ కూడా ఉండొచ్చు. గైనకాలజిస్ట్ సూచించిన యాంటీ బయాటిక్స్ తో బీవీని సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం, ఇప్పుడున్న ఆహారపు అలవాట్లను మార్చడం వల్ల యోని నుంచి చేపల వాసన రావడం తగ్గుతుంది. ఆకుపచ్చ ఉత్సర్గతో పాటుగా ఘాటైన వాసన వస్తే అది ఎస్టీఐ కావొచ్చు. అయితే దీన్ని మీరే నిర్ధారించకుండా హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోవడం మంచిది. 

క్రమరహిత ఉత్సర్గ

కాటేజ్ జున్ను లాగా లేదా పసుపు రంగులో ఉన్న యోని ఉత్సర్గ ఈస్ట్, ఫంగల్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావొచ్చు. బిగుతుగా గాలి కూడా వెళ్లలేని లోదుస్తులను వేసుకోవడం, డౌచింగ్ లేదా చక్కెర ఎక్కువగా ఉన్న అనారోగ్యకరమైన ఆహారాల వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి గైనకాలజిస్ట్ ను తప్పకుండా సంప్రదించాలి. నీటిని పుష్కలంగా తాగడం, ఎక్కువ చక్కెర ఆహారాలు, ఆల్కహాల్ ను తగ్గించడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు మార్పులు ఈ సమస్య నుంచి తొందరగా బయటపడేస్తాయి. 
 

క్రమరహిత రక్తస్రావం

పీరియడ్స్ లేనప్పుడు కూడా రక్తస్రావం లేదా మచ్చలు హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం. సెక్స్ తర్వాత రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్ కు సంకేతం కావొచ్చు. అయితే ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కు సంకేతం అని చెప్పలేం. గైనకాలజిస్ట్ తో రోగనిర్ధారణ చేయించుకోవడం మంచిది. 
 

దురద, ఎరుపు

యోనిలో లేదా యోనిచుట్టుపక్కల దురదగా ఉంటే యోని ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. ఎందుకంటే ఇది హార్మోన్ల మార్పులు లేదా ఏదైనా వ్యక్తిగత పరిశుభ్రత అలెర్జీ ప్రతిచర్య కలగొచ్చు. దీనివల్ల యోని పొడిబారుతుంది. అలాగే దురద లేదా ఎరుపు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (ఎస్టిఐలు) లేదా బాక్టీరియల్ వాగినోసిస్ కు సంకేతాలు కావొచ్చు.
 

మండుతున్న అనుభూతి

యోనిలో మండుతున్న అనుభూతి లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట కలగడం అనారోగ్యకరమైన యోని లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) కు సంకేతం. ఇది ఈస్ట్, బ్యాక్టీరియా లేదా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కావొచ్చు. ఎప్పుడూ ఇలాగే అవుతుంటే వెంటనే  హాస్పటల్ కు వెళ్లడం మంచిది.

click me!