ఎలాంటి మందులు వాడకుండా PCOD సమస్యకు చెక్..!

First Published | Dec 23, 2021, 3:59 PM IST

పిసిఒడి అనేది గర్భాశయానికి సంబంధించిన వ్యాధి. పీసీఓడీ ఉన్నవారికి రుతుక్రమం సమస్య ఉంటుంది. కొందరికి అధిక రక్తస్రావం, మరికొందరికి ఆలస్యంగా పీరియడ్స్ రావడం.. లేదంటే.. 15 రోజులకి ఒకసారి  రక్తస్రావం లాంటివి జరుగుతాయి. 

pcod

ఈ మధ్యకాలంలో చాలా మంది అమ్మాయిలు PCOD సమస్యతో బాధపడుతున్నారు. దారితప్పిన లైఫ్ స్టైల్ ఇందుకు కారణం కావడం గమనార్హం. దీని వల్లే.. మన హార్మోన్లలో అసతుల్యత ఏర్పడుతుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత  పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో... పీసీఓడీ బాధితులుగా మారుతున్నారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు పీసీఓడీతో బాధపడుతున్నారు.

పిసిఒడి అనేది గర్భాశయానికి సంబంధించిన వ్యాధి. పీసీఓడీ ఉన్నవారికి రుతుక్రమం సమస్య ఉంటుంది. కొందరికి అధిక రక్తస్రావం, మరికొందరికి ఆలస్యంగా పీరియడ్స్ రావడం.. లేదంటే.. 15 రోజులకి ఒకసారి  రక్తస్రావం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా  శరీర భాగాలపై దట్టమైన వెంట్రుకలు కనిపిస్తాయి. బాధాకరమైన మొటిమలు కనిపిస్తాయి. బరువు పెరగడం ప్రారంభమవుతుంది. ప్రెగ్నెన్సీ రావడం కష్టమౌతుంది.. మానసిక సమస్యలు పెరుగుతాయి.

Latest Videos


pcod

PCOD కారణాలు: ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా, దీని నుంచి బయటపడొచ్చు. జంక్ ఫుడ్ , బయటి ఆహార పదార్థాలు తినే మహిళలు దీనిబారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయని మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం, బరువు పెరగడం, చిరాకు పడడం వంటివి ఒత్తిడితో కూడిన మహిళలకు ప్రమాదకరం.

pcod in women

ముందే చెప్పినట్లుగా ఇది జీవనశైలికి సంబంధించినది కాబట్టి మీరు ముందుగా మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. దీనికి ఔషధం ఉంది. చికిత్స తీసుకోకపోతే ఆరోగ్యం మరింత దిగజారుతుంది. కాబట్టి జీవనశైలి మెరుగుపరుచుకోవాలి.


విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం: పిసిఒడి బాధితులైన మహిళలు విటమిన్ డి , విటమిన్ బి పుష్కలంగా తినాలి. ఉదయం నిద్ర లేచిన అరగంట లోపు ఆహారం తీసుకోవడం మంచిది. ఉదయాన్నే నానబెట్టిన బాదం,  వాల్‌నట్‌లతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. గుడ్డులోని తెల్లసొన, పనీర్ శాండ్‌విచ్‌లు, ఓట్స్ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. భోజనానికి 2 గంటల ముందు సలాడ్ పుష్కలంగా తినండి. రాత్రి భోజనంలో, అది సూప్, ఇడ్లీ, పనీర్ తినొచ్చు. మంచినీరు ఎక్కువగా తాగాలి.
 

yoga


నడక, వ్యాయామం: ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోండి. సాధారణ యోగా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

ఈ ఆహారానికి దూరంగా ఉండండి: వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీ, కేక్, చిప్స్, శీతల పానీయం, ఐస్ క్రీం, సోడా, ప్యాక్ చేసిన ఆహారం, జ్యూస్ వంటివి తీసుకోవద్దు. ప్రాసెస్ చేసిన మాంసాలు , రెడ్ మీట్‌లు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లను తీసుకోవద్దు.
 

తీసుకోవాల్సిన ఆహారాలు
ఆకుపచ్చ కూరగాయలు, ఫెన్నెల్, గ్రీన్ క్యాప్సికమ్, మిరపకాయ, బీన్స్, పాలక్, క్యారెట్, యాపిల్స్, దానిమ్మ ,కివీ, బెర్రీలు,  కొత్తిమీర తోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

flax seeds

జీవక్రియను పెంచడానికి గ్రీన్ టీని రోజుకు రెండుసార్లు తీసుకోండి. ఆలివ్ నూనె ఉపయోగించండి. గుడ్లు ,చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. బాదం, వాల్‌నట్‌లు, టమోటాలు, అవిసె గింజలు, దాల్చినచెక్క ,పసుపు మీ ఆహారంలో ఉండండి.

click me!