టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో సమంత ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవల దానికి సంబంధించి సమంత ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది. ఆమె.. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. నిజంగానే ఆ సినిమాతో తెలుగు ప్రజలను ఆమె మాయ చేశారు. ఇప్పటికీ ఆమె మాయలో అలానే ఉన్నారని చెప్పొచ్చు.