Face Glow: ఈ పండు గుజ్జు ముఖానికి రాస్తే, అందం రెట్టింపు అవ్వడం పక్కా

Published : Feb 27, 2025, 04:43 PM IST

పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటాం.. అదే పండ్లను డైరెక్ట్ గా ముఖానికి రాస్తే.. అందంగా తయారౌతాం. రెగ్యులర్ గా ముఖానికి బొప్పాయి గుజ్జు  రాస్తే ఏమౌతుందో చూద్దాం..    

PREV
16
Face Glow: ఈ పండు గుజ్జు ముఖానికి రాస్తే, అందం రెట్టింపు అవ్వడం పక్కా

బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ తినడం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. చాలా రకాల సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు.. ఈ బొప్పాయి పండు.. మన అందాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది. మీరు చదివింది నిజమే. బొప్పాయిలో ఉండే పోషకాలు మన ముఖ కాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రెగ్యులర్ గా బొప్పాయి చిన్న ముక్కను గుజ్జులా చేసి దానిని ముఖానికి రాస్తే చాలు. కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...

26

ఎక్స్‌ఫోలియేషన్

బొప్పాయి పండులో మన చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఎంజైమ్ లు ఉంటాయి. ముఖ్యంగా  పాపైన్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్ (AHA) వంటి సహజ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తాయి. ముఖం స్మూత్ గా మారుతుంది.

మెరిసే చర్మం

బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో చర్మం రంగు మెరుగుపడుతుంది, చర్మం మెరుస్తుంది.

36

చర్మం హైడ్రేషన్

బొప్పాయి పండులో  నీటి శాతం ఎక్కువ. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చర్ పెంచుతుంది. దీనివల్ల చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది. దీనిని రాస్తే మళ్లీ స్పెషల్ గా మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. అంతగా చర్మాన్ని అందంగా మారుస్తుంది.

46

చర్మం ఎరుపుదనం, వాపు తగ్గించే బొప్పాయి..

బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. అలాగే బీటా-కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు కూడా ఉన్నాయి. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చర్మం ఎరుపుదనం, వాపు లాంటివి కూడా తగ్గించేస్తాయి.

56

మొటిమలు దూరం చేస్తుంది..

బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు, విటమిన్లు వాపును తగ్గిస్తాయి, మొటిమలను అదుపులో ఉంచుతాయి. బొప్పాయి ఫేస్ మాస్క్ రెగ్యులర్‌గా వాడితే మొటిమలు రాకుండా ఉంటాయి.

66

యాంటీ ఏజింగ్

బొప్పాయిలో విటమిన్ సి, బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి, వృద్ధాప్యం రాకుండా చూస్తాయి.

చర్మం రిపేర్

బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి, పునరుజ్జీవింపజేస్తాయి. గాయాలు, మచ్చలు, మరకలను నయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

click me!

Recommended Stories