onion
మనం రెగ్యులర్ గా తెల్ల, ఉల్లిపాయలను వంటల్లో తింటుంటాం. ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అయితే ఎర్ర ఉల్లిపాయలు మన జుట్టుకు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోకుండా చేసేందుకు, పొడుగ్గా పెరిగేందుకు, చుండ్రును పోగొట్టేందుకు రెడ్ ఉల్లిపాయలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎర్ర ఉల్లిపాయల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అసలు ఎర్ర ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టు పెరుగుదల బలోపేతం
వెంట్రుకలను తయారుచేసే ప్రోటీన్ అయిన కెరాటిన్ లో సల్ఫర్ ఒక ముఖ్యమైన భాగం. ఎర్ర ఉల్లిపాయలలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను, ఖనిజాలను అందించడానికి సహాయపడుతుంది. ఎర్ర ఉల్లిపాయలతో జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు తెగిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా ఉండటానికి సహాయపడతాయి.
hair care
చుండ్రు దూరం
చుండ్రు వల్ల వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతాయి. అలాగే నెత్తిమీద దురద కూడా పెడుతుంది. అయితే ఎర్ర ఉల్లిపాయల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి దురదను తగ్గిస్తాయి. అలాగే ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియా, శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. ఇవి మీ నెత్తిని శుభ్రంగా ఉంచుతాయి.
జుట్టుకు పోషణ
సల్ఫర్ తో పాటుగా ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ బి6 లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడతాయి. దీనిలో ఉండే ఈ విటమిన్లు జుట్టు కుదుళ్లను పోషించడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.
hair growth
ఎర్ర ఉల్లిపాయలను ఎలా ఉపయోగించాలి?
జుట్టు సంరక్షణలో భాగంగా ఎర్ర ఉల్లిపాయలను ఉపయోగించాలనుకుంటే మీరు ఒకటి నుంచి రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేయండి. దీన్ని జ్యూసర్ లేదా బ్లెండర్ ఉపయోగించి రసం తీయండి. ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేయండి. ఈ రసం నెత్తిమీది నుంచి చివర్ల వరకు మొత్తం పెట్టి బాగా మసాజ్ చేయండి. మీరు ఎర్ర ఉల్లిపాయలను క్రమం తప్పకుండా ఉపయోగించొచ్చు. అలాగే వారానికి ఒకసారి వాటిని మీ జుట్టు సంరక్షణ దినచర్యలో చేర్చొచ్చు.