ప్రస్తుత కాలంలో మనం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. అన్నింట్లోనూ విజయాలు సాధిస్తున్నాం... అయినప్పటికీ.. కొన్ని విషయాల గురించి సమాజంలో ఓపెన్ గా మాట్లాడుకోలేకపోతున్నాం. అలాంటి వాటిలో శృంగారం, మహిళల లైంగిక ఆరోగ్యం, లైంగిక పరిశుభ్రతలు ముందు వరసలో ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు.. తమకు ఏవైనా లైంగిక సంబంధిత సమస్యలు ఎదురైనా.. వాటిని కనీసం బయటకు చెప్పడటానికి ఇష్టపడటం లేదు. వైద్యులను కూడా సంప్రదించడం లేదు. దీని వల్ల.. అనేక ఆరోగ్య సమస్యలు వాళ్లను చుట్టిముట్టేస్తున్నాయి.