కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి? వాటిని ఎలా తగ్గించుకోవాలి?

First Published | Aug 14, 2024, 2:05 PM IST

ఒకవయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ డార్క్ సర్కిల్స్ వస్తాయి. కానీ ఈ డార్క్ సర్కిల్స్ అందాన్ని తగ్గిస్తాయి. ముఖంలో ఈ డార్క్ సర్కిల్సే ముందుగా కనిపిస్తాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయో తెలుసా?
 

ప్రస్తుత కాలంలో చాలా మంది డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ డార్క్ సర్కిల్స్ ముఖ అందాన్ని పాడుచేస్తాయి. దీనివల్ల కళ్ల కింద ఉన్న నల్లని చర్మమే ముఖంలో ముందు కనిపిస్తుంది.  ఇది ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. అసలు ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

నిద్ర లేమి 

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఈ నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావడంతో పాటుడా కళ్ల కింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయి. మీరు గనుక ప్రతిరోజూ కంటినిండా నిద్రపోనట్టైతే ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ సమస్య వస్తుంది. 


ఇనుము లోపం

మగవారికంటే ఆడవారి శరీరంలోనే ఇనుము లోపం ఉంటుంది. ఈ ఐరన్ లోపం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి తెలుసా. ఎలా అంటే ఇనుము లోపం వల్ల ఎర్ర రక్త కణాలు ఏర్పడవు. దీంతో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. 

ముఖ సౌందర్యంతో పాటు కంటి సౌందర్యానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందుకోసం ఇంట్లోనే కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ (Tips) ను అనుసరిస్తే నల్లటి వలయాలు తగ్గి ముఖ సౌందర్యం మరింత రెట్టింపవుతుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

డీహైడ్రేషన్ 

చాలా మంది నీళ్లను సరిగ్గా తాగనే తాగరు. తింటున్నప్పుడో, బాగా దాహమైనప్పుడో మాత్రమే నీళ్లను తాగుతుంటారు. కానీ దీనివల్ల శరీరంలో నీళ్ల కొరత ఏర్పడుతుంది. ఈ డీహైడ్రేషన్ వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం నల్లగా మారుతుంది. ఒంట్లో సరిపడా నీళ్లు లేకపోవడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. దీనివల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. 
 


విటమిన్ లోపం 

ఒక్క ఐరన్ లోపంతోనే కాకుండా శరీరంలో వివిధ రకాల విటమిన్ల లోపం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మొదలైన విటమిన్లు లోపించినా కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. 
 

ఒత్తిడి

ఈరోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బాగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్నే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది కళ్ల చుట్టూ ఉన్న చర్మం నల్లగా మారేలా కూడా చేస్తుంది. ఎక్కువ ఒత్తిడికి గురైతే మీ శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. 

పెరుగుతున్న వయస్సు

వయసు పెరగడం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కళ్ల కింద ఉన్న చర్మం సడలడం మొదలై డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. 

డార్క్ సర్కిల్స్ ను ఎలా తగ్గించుకోవాలి? 

డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గించుకోవడానికి మీరు మీ జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. కంటనిండా నిద్రపోవాలి. నీళ్లను పుష్కలంగా తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకుంటూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. 

Latest Videos

click me!