దిండ్లు, దుప్పట్లు, ప్లాస్టిక్ డబ్బాలు ఎంతకాలం వాడాలో తెలుసా?

First Published Apr 15, 2024, 1:39 PM IST

మనం ఎంత ఉతికినా కూడా ఆ క్రిములు పోతాయని అనుకోకూడదు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి... వీటిని రెగ్యులర్ గా  మారుస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు.
 

pillow

 మన ఇంట్లో కామన్ గా వాడే వస్తువులు కొన్ని ఉంటాయి.  టీవీలు, ఫ్రిడ్జ్ లు రిపేర్ వస్తే మనకు వాటిని మార్చేయాలని మనకు తెలుస్తుంది. కానీ.. ఇంట్లో వంటకు వాడే గిన్నెలు, బెడ్రూమ్ లో బెడ్ పై ఉంచే దిండు, దుప్పట్లు, టవల్స్ లాంటివి మాత్రం సంవత్సరాలు సంవత్సరాలుగా వాడుతూనే ఉంటాం.  ఇది మా అమమ్మ ఇచ్చింది.. ఇది మా అత్గారు ఇచ్చింది అని.. పిల్లలు పెద్దయ్యే వరకు  వాడుతూనే ఉంటారు. కానీ.. అలా వాటిని వాడొచ్చా..? వీటిని ఎంతకాలం వాడొచ్చు..? సంవత్సరాలు సంవత్సరాలు వాడొచ్చా..? ఈ విషయాలను  ఇప్పుడు తెలుసుకుందాం..

non stick pans

దిండ్లు, దుప్పట్లు, టవల్స్ లాంటి వాటిని మనం రెగ్యులర్ గా  మారుస్తూ ఉండాలి. ఎందుకంటే వీటిలో చాలా  క్రిములు ఉంటాయి. మనం ఎంత ఉతికినా కూడా ఆ క్రిములు పోతాయని అనుకోకూడదు. వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి... వీటిని రెగ్యులర్ గా  మారుస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు.

మనం మన ఇంటిని శుభ్రంగానే ఉంచుకుంటాం. అయినా కూడా ఇంట్లో బ్యాక్టీరియా దాగి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా కిచెన్, బాత్రూమ్ లో ఈ బ్యాక్టీరియా మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ రెండు ప్రదేశాలు ఎప్పుడూ తడిగా ఉంటాయి. కాబట్టి.. బ్యాక్టీరియా తయారవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాల్లో వాడే వస్తువులను తరచూ మార్చకపోతే.. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

food in plastic containers

కొన్ని ఉత్పత్తులను వాటి గడువు తేదీ కంటే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే నాన్ స్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు గిన్నెలు లాంటివి వాటి సర్వీస్ అయిపోయినా కూడా.. వాడుతూ ఉంటారు. అయితే...వాటిలో ఉండే  ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఏ వస్తువులను ఎంత కాలం వాడాలో కొనే ముందే తెలుసుకోవాలి.

1.ప్లాస్టిక్ డబ్బాలు..
మనలో చాలా మంది సంవత్సరాలు సంవత్సరాలుగా ప్లాస్టిక్ డబ్బాలను వాడుతూ ఉంటాం. కానీ..  వీటిని ప్రతి రెండు లేదంటే.. మూడు సంవత్సరాలకు మార్చేస్తూ ఉండాలి. ఎందుకంటే..వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా తయారౌతూ ఉంటుంది. కాబట్టి.. వీటి ప్లేస్ లో గ్లాస్ కంటైనర్లు, స్టీల్ వస్తువులు వాడటం ఉత్తమం.
 

2. కిచెన్ స్పాంజీలు..
గిన్నెలు శుభ్రం చేయడానికి మనం స్పాంజీలు వాడుతూ ఉంటాం. ఆ స్పాంజీలను కూడా  మారుస్తూ ఉండాలి. ఎందుకంటే...వాటిలో కూడా టాయ్ లెట్ తో సమానమైన బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి వీటిని.. ఒకటి లేదంటే..రెండు వారాల కంటే ఎక్కువగా వాడకూడదు. స్పాంజి కంటే సిలికాన్ స్క్రబ్బర్స్ వాడటం ఉత్తమం.

nonstick utensil


3. నాన్ స్టిక్ ప్యాన్స్..
నాన్ స్టిక్ కుక్ వేర్ ని కూడా 3 నుంచి 5 ఏళ్లకు మించి వాడకూడదు. వీటిలోనూ చాలా రకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు.  ఇవి పుడ్ ని విషపూరితం చేస్తాయి. కాబట్టి.. ఈ నాన్ స్టిక్ కంటే.. హై క్వాలటీ ఉండే ప్యాన్స్ ఎంచుకోవడం ఉత్తమం. ఐరన్ అయితే.. ఆరోగ్యానికి ఇంకా మంచిది.

Pillowcases

4. దిండ్లు..
మనం సంవత్సరాలుగా వాడుతూ ఉంటాం. కానీ దిండ్లను 1 నుంచి రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే.. వీటిలో దుమ్ము, చెమట పేరుకుపోయి ఉంటాయి . ఇవి చర్మం డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతాయి. దిండ్లు ఎక్కువ కాలం వాడాలి అంటే వాటికి ప్రొటెక్టర్లు ఉంచాలి. వాటిని రెగ్యలర్ గా ఉతుకుతూ ఉండాలి.


5.మ్యాట్రెసెస్..
మనం దాదాపు దిండ్లు, బెడ్ షీట్స్ అయినా మారుస్తూ ఉంటాం. కానీ మ్యాట్రెసెస్ మాత్రం మార్చం. వీటిలోనూ బ్యాక్టీరియా ఎక్కువగా తయారౌతుంది. కాబట్టి.. వీటిని  7 నుంచి 10ఏళ్లకు మించి వాడకుండా ఉండటం మంచిది.

click me!