పీరియడ్స్ అనేది స్త్రీ యొక్క పునరుత్పత్తిలో సాధారణ విషయం. అయినప్పటికీ.. ఇది కొన్నిసార్లు అసౌకర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా హెవీ బ్లీడింగ్, భరించలేని కడుపు నొప్పి వచ్చినప్పుడు. కొన్ని సందర్భాల్లో సాధారణం కంటే ఏడు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంటుంది. దీనిని మెనోరాగియా అంటారు. ఈ సమస్య నుంచి మీరు బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే?
హెవీ పీరియడ్స్ కు కారణమేంటి?
హార్మోన్ల అసమతుల్యత
హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడప్పుడు ఇలా అవుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు హెచ్చుతగ్గులను లోనైనప్పుడు హెవీ బ్లీడింగ్ ఉంటుంది. పీరియడ్స్ ఎక్కువ రోజులు అవుతాయి.ఈ హార్మోన్ల మార్పులు గర్భాశయ గోడ మందాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ఇది ఎక్కువ రోజులు పీరియడ్స్ అయ్యేలా చేస్తుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్ సమస్యలు కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి.
పునరుత్పత్తి మార్గ సంక్రమణ
పీఐడీ అనేది ఆడ పునరుత్పత్తి అవయవాల సంక్రమణ. ఇది ఎక్కువగా క్లామిడియా లేదా గోనేరియా వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధుల వల్లే వస్తుంది. ఇది ఇతర లక్షణాలతో పాటుగా హెవీ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణమవుతుంది.
గర్భాశయ ఫైబ్రాయిడ్లు
ఫైబ్రాయిడ్లు అంటే గడ్డలు లేదా కణితులు. ఇవి గర్భాశయంలో పెరుగుతాయి. కానీ క్యాన్సర్ గడ్డలు కాదు. ఇవి కూడా హెవీ లేదా చాలా కాలం పీరియడ్స్ కు కారణమవుతాయి.
పీసీఓఎస్
పీసీఓఎస్ అనేది హార్మోన్ల రుగ్మత. ఇది అండాశయ తిత్తులు, బరువు పెరగడం,అధిక జుట్టు పెరుగుదల వంటి లక్షణాలను చూపిస్తుంది. అలాగే ఇది కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా అధిక రక్తస్రావానికి కారణమవుతుంది.
హెవీ బ్లీడింగ్ కు బెస్ట్ చిట్కాలు
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల బ్లీడింగ్ చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ అలసటను, తలనొప్పి, తిమ్మిరి వంటి లక్షణాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఫిల్టర్ చేయని, ముడి ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కలిపి తాగండి.
పుష్కలంగా నీళ్లు తాగాలి
అధిక రక్తస్రావం ఒంట్లో రక్త పరిమాణాన్ని తగ్గిస్తుంది. అయితే దీనిని మీరు రోజుకు 5 నుండి 7 కప్పుల అదనపు కప్పుల నీటిని తాగడం వల్ల సెట్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరం అదనపు ద్రవ అవసరాలను తీర్చడానికి ఎలక్ట్రోలైట్లను నీటిలో కలిపి తీసుకోవాలి.
అల్లం నీరు
అల్లం నీటిని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే హెవీ బ్లీడింగ్ ఆగిపోతుంది. హెవీ బ్లీడింగ్ కు అల్లం నీరు బెస్ట్ హోం రెమెడీ. అల్లాన్ని పచ్చిగా నానబెట్టొచ్చు లేదా టీలో మరిగించి తాగొచ్చు.
సోంపు గింజలు
సోంపు గింజల్లో ఎంమెనాగోగ్ అనే రసాయనం ఉంటుంది. ఇది తిమ్మిరి, కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది అధిక రుతుస్రావానికి సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ క్వార్టర్లీ జర్నల్ ఆఫ్ ఆయుర్వేద రీసెర్చ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఇది పీరియడ్ నొప్పిని తగ్గిస్తుంది. సోంపు గింజలను కొన్ని నీటిలో పోసి, రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగాలి.