2023లో మెరిసిపోవాలా..? ఈ స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వండి...!

First Published Dec 22, 2022, 1:03 PM IST

ఈ నూతన సంవత్సరంలో అందంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. మరి ఈ నూతన సంవత్సరంలో  అందంగా మెరిసిపోవాలంటే ఈ సింపుల్ ట్రిక్స్  ఫాలో అవ్వమని నిపుణులు సూచిస్తున్నారు.

మరో వారం రోజుల్లో మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో అందంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. మరి ఈ నూతన సంవత్సరంలో  అందంగా మెరిసిపోవాలంటే ఈ సింపుల్ ట్రిక్స్  ఫాలో అవ్వమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

1.నెరోలీ ఆయిల్...

చర్మం తాజాగా ఉండాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అలాంటప్పుడు... నెరోలీ ఆయిల్ చర్మాన్ని తాజాగా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఈ నూనెను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల.. ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. దీనికి రెండు చుక్కలు తీసుకొని బాదం నూనెలొ కలపాలి. తర్వాత దానిని.. ముఖానికి అప్లై చేసి... మెల్లగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత.... హాట్ టవల్ ని ముఖంపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల రిలాక్స్ ఫీలింగ్ కలుగుతుంది. ముఖం తాజాగా మెరిసిపోతుంది.

2. గోరువెచ్చని నీరు...
చాలా మంది స్నానం అనగానే... వేడి వేడి నీటితో చేస్తారు. ఇలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల.. చర్మం డ్రైగా మారుతుంది. ముఖాన్ని తాజాగా ఉంచాల్సిన నూనెలను వేడినీరు తొలగించేస్తాయి. కాబట్టి.... గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. అంతేకాదు.... ఘాటుగా ఉన్న సబ్బులను, క్లెన్సర్స్ ని  ఉపయోగించకూడదు. ఘాడత తక్కువ ఉన్న సబ్బులను వాడాలి.
 

3.ఆరోగ్యకరమైన ఆహారం...
ఆరోగ్యకరమైన ఆహారం... చర్మాన్ని అందంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మీ డైట్ లో.... పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా.. ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా చేపలు, ఫిష్ సప్లమెంట్స్ కూడా... ఆహారంలో భాగం చేసుకోవాలి. మంచినీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల కూడా చర్మం అందంగా మెరుస్తుంది.

sleep job

4.ఒత్తిడి, నిద్ర..
ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. దీని వల్ల కూడా చర్మం అందంగా మెరుస్తూ ఉంటుంది. ఇక నిద్ర కూడా చాలా అవసరం. కాబట్టి.... ప్రతిరోజూ 8గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల కూడా చర్మం అందంగా మెరవడానికి కారణం అవుతుంది.

5.ఐజెల్...
కంటి కింద డార్క్ సర్కిల్స్ తో బాధపడేవారు చాలా మందే ఉంటారు. అవి తగ్గించుకునేందుకు.... ఐ జెల్స్ ఉపయోగించాలి. ఏదైనా ఐ క్రీమ్ లేదంటే... ఐ జెల్ వాడటం వల్ల.... కంటికింద డార్క్ సర్కిల్స్ తొలగించవచ్చు. లేదంటే... మన కిచెన్ లో ఉండే... ఆలుగడ్డ ముక్కలను ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు రుద్దడం వల్ల.... డార్క్ సర్కిల్స్ తగ్గడంతో పాటు.. స్మూత్ గా చేసుకునేలా చేస్తుంది.

6.బనానా ఫేస్ ప్యాక్...
బనానా ఫేస్ ప్యాక్... ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాదు... చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ఒక అరటిపండు, ఒక స్పూన్ తేనె, పావు స్పూన్ పాల మీగడ, గంధం నూనె, అన్నింటినీ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి... 20 నిమిషాల తర్వాత.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

7.ఫౌండేషన్...
మేకప్ కోసం ఫౌండేషన్ ఉపయోగించడం చాలా కామన్ గా జరిగే విషయం. అయితే... ఈ ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు చాలా లైట్ గా ఉన్నది ఎంచుకోవాలి. ముఖ్యంగా వాటర్ బేస్డ్ ఫౌండేషన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.
 

8.పసుపు...
వయసు తక్కువగా కనిపించాలని అనుకునేవారు... పసుపు ని ఉపయోగించవచ్చు. కొత్త చర్మ కణాలు వచ్చేందుకు...ఈ పసుపు ఉపయోగపడుతుంది. చర్మ కణాల డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి కూడా సహాయం చేస్తుంది. కొద్దిగా పసుపులో  బియ్యం పిండి వేసి... దానిలో కొద్దిగా నీరు లేదంటే రోజ్ వాటర్ వేసి.. పేస్టులా తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి రాయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి.

Bhatkal Jasmine

9.జాస్మిన్ ఆయిల్..
వయసు పెరిగే కొద్ది.. ముఖం సాగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమస్య తగ్గాలి అంటే... జాస్మిన్ ఆయిల్ ని ఉపయోగించాలి. జాస్మిన్ ఆయిల్ లో కొద్దిగా బాదం నూనె వేసి... ముఖానికి అప్లై చేసి... నెమ్మిదిగా మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం సాగే తత్వం నుంచి బయటపడొచ్చు.

10.ట్రీట్రీ ఆయిల్..
ముఖంపై మొటిమల సమస్యతో బాధపడేవారు... టీట్రీ ఆయిల్ ని ఉపయోగించాలి. టీ ట్రీ ఆయిల్ ని ముఖానికి అప్లై చేయడం వల్ల... మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

11.ట్యాన్ రీమూవల్...
ట్యాన్ తొలగించడానికి పెరుగు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక స్పూన్ పెరుగులో చిటికెడు ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం, చందనపు నూనె వేసి బాగా కలపాలి. దీనిని ఒక పొటాటో ముక్కపై ఉంచి.. ముఖానికి జెంటిల్ గా అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత.. ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల... ట్యాన్ ని తొలగించడానికి ఉపయోగపడుతుంది.

tomato

12.టమాటా...
టమాట రసం కూడా.. ట్యాన్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి... ముఖానికి టమాట రసాన్ని రాయడం వల్ల ట్యాన్ తగ్గిపోవడం తో పాటు..... చర్మం డ్రైనెస్ తగ్గి... మళ్లీ తాజాగా మెరవడానికి ఉపయోగపడుతుంది.

click me!