పిల్లల విషయంలో ఈ పొరపాట్లు.. వారి జీవితమే ప్రశ్నార్థకం..!

First Published Nov 8, 2021, 5:11 PM IST

వారు ఏదైనా విజయం సాధించినప్పుడు ప్రశంసించడం లాంటివి చేయాలి. లేదంటే.. మీ ప్రేమ వారికి తెలిసే అవకాశం తక్కువ.

parenting

ఈ ప్రపంచంలో అన్ని రిలేషన్స్ తోపాటు.. తల్లీ-బిడ్డల బంధదం కూడా చాలా గొప్పది. బిడ్డకు ప్రతి విషయాన్ని కన్న తల్లిదండ్రులే నేర్పించాలి. వారు పెద్దైక మంచి మార్గంలో ఉన్నా... చెడు మార్గంలోకి అడుగుపెట్టినా.. అది తల్లిదండ్రుల పెంపకపంపై కచ్చితంగా ఉంటుంది.  మనలో చాలా మంది.. తమ కన్నబిడ్డలను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. వారి కోసం తమ జీవితం మొత్తం దారపోస్తారు. అయితే.. తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు మాత్రం.. బిడ్డల భవిష్యత్తుపై పడతాయని.. అది వారిలో నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

1. కొందరు.. తమ బిడ్డలను విపరీతంగా ప్రేమిస్తారు. వారికి మంచి జీవితం ఇవ్వడం కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంటారు.  సంపాదించిన మొత్తాన్ని వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ.. తాము తమ పిల్లలను ప్రేమిస్తున్నామనే విషయాన్ని మాత్రం వారికి చెప్పరు. పిల్లలకు మీరిచ్చే డబ్బు కన్నా.. మీ నుంచి వచ్చే ఆప్యాయత, ప్రేమ చాలా అవసరం. కాబట్టి..  మీప్రేమను వారికి తెలియజేయాలి. వారు ఏదైనా విజయం సాధించినప్పుడు ప్రశంసించడం లాంటివి చేయాలి. లేదంటే.. మీ ప్రేమ వారికి తెలిసే అవకాశం తక్కువ.

2.ఇంట్లో తరచూ తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే.. ఆ ప్రభావం  పిల్లలపై ఉంటుంది. వారి మనసులో ఆ గొడవకు సంబంధించిన ప్రభావాలు మరకల్లా ఉండిపోతాయి. అవి వారిపై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి.. వారి ముందు గొడవ పడకుండా ఉండాలి. మీ పిల్లలు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటే మీరెంత ఆనందిస్తారో కూడా వారికి వివరించాలి.

3.ఇక పిల్లల విషయంలో నిర్ణయాలు పెద్దలే తీసుకుంటారు. అయితే.. ఆ నిర్ణయాలు మనం ఎలా తీసుకుంటున్నామనే విషయం కూడా చాలా ముఖ్యమట. వారిని ప్రతి విషషయంలోనూ కంట్రోల్ చేయాలని అనుకోకూడదు. అలా చేయడం వల్ల.. వారిలో అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంటుంది. తాము చేయలేమేమో అనే అనుమానం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వారిలో ఏదైనా సాధించగలమనే విశ్వాన్ని మీరే పెంచాలి.

parenting

.పిల్లలకు జీవితంలో కొన్ని సరిహద్దులు మనం నేర్పించాలి. వారు ప్రతి విషయాన్ని మీతో చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఇవ్వాలి. వారి ప్రవర్తనను పర్యవేక్షిస్తూ ఉండాలి. వారిపై నమ్మకం కలిగి ఉండాలి. అబద్ధం చెప్పడం తప్పు అనే విషయాన్ని వారికి చిన్న వయసులోనే నేర్పించాలి.

.మీ పిల్లల ముందు భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడకండి. ఇది వారి మనస్సులపై గాయం మీద శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఇది భవిష్యత్తులో వారి స్వంత సంబంధాలపై అనుమానం కలిగిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురుచూసే వ్యక్తులు అయినప్పటికీ, మీరు ప్రేమ, విశ్వాసం మరియు విధేయతకు ఉదాహరణగా ఉండాలి, అలాగే వారి సమస్య పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరచాలి.

click me!