ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. కెఫీన్ ఎక్కువగా ఆహారాలను కూడా పూర్తిగా మానేయాలి. జంక్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మీరు అర్థరాత్రి అతిగా తినడం అలవాటు చేసుకుంటే ముందుగానే రాత్రి భోజనానికి దూరంగా ఉండండి. ఇక చాలా మంది కొవ్వు పూర్తిగా లేని ఆహారాన్ని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.