ఇదెక్కడి రూల్... పీరియడ్స్ లో స్త్రీలు నీళ్లు ముట్టుకోకూడదా..?

First Published Mar 2, 2021, 11:48 AM IST

ఆ గ్రామంలో దాదాపు 300మంది జనాభా ఉండగా.. వారంతా ఆ చెరువులోని నీరు తాగునీరుగా వినియోగిస్తూ ఉంటారు.

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో దూసకువెళుతున్నారు. పురుషులతో సమానంగా అన్నింటా ముందున్నారు. అయితే.. ఇవన్నీ నాణేనికి ఒకవైపుకి మాత్రమే అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకంటే.. మరో వైపు ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతోంది.
undefined
పీరియడ్స్ లో ఆ పనిచేయొద్దు... ఈ పని చేయొద్దూ అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా.. ఓ గ్రామంలో పీరియడ్స్ సమయంలో మహిళలకు విధించిన ఆంక్షలు వింటే.. ఆశ్చర్యపోకమానరు.
undefined
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పైపేడు గ్రామంలో.. ఓ చిన్న చెరువు ఉంది. ఆ చెరువులోని నీటిని గ్రామస్తులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే.. ఆ చెరువు వద్దకు పీరియడ్స్ లో ఉన్న మహిళలను గ్రామస్థులు అనుమతించారు.
undefined
ఆ గ్రామంలో దాదాపు 300మంది జనాభా ఉండగా.. వారంతా ఆ చెరువులోని నీరు తాగునీరుగా వినియోగిస్తూ ఉంటారు. ఆ చెరువులోని నీరు వాటర్ పైప్ లైన్ ద్వారా గ్రామస్థులకు చేరువయ్యేది. అయితే.. సంవత్సరం క్రితం అది పాడైంది. అప్పటి నుంచి మళ్లీ చెరువుకి వెళ్లే నీరు తెచ్చుకుంటున్నారు.
undefined
అయితే.. పీరియడ్స్ సమయంలో ఆ చెరువు వద్దకు మహిళలను అనుమతించరు. ఐదు రోజుల పాటు వారు ఆ చెరువు దగ్గరకు వెళ్లడానికి వీలు లేదు. కనీసం ఆ ఇంట్లో మగవారు కూడా సహాయం చేయకూడదు. అలాంటి నిబంధన ఆ గ్రామంలో కొనసాగుతోంది. ఆ ఐదు రోజులు వారు నీటి కోసం తిప్పలు పడక తప్పదు.
undefined
కొన్ని సంవత్సరాలుగా వారు అదే నియమాన్ని పాటిస్తూ వస్తున్నారు. పదేళ్ల క్రితం ఒకసారి ఆ చెరువు మొత్తం ఎండిపోయిందట. ఓ మహిళ పీరియడ్స్ లో చెరువులోకి వెళ్లడం వల్లనే.. అది అలా ఎండిపోయి ఉంటుందని వారు భావిస్తుండటం గమనార్హం.
undefined
పీరియడ్స్ సమయంలో.. వాళ్లకు తాగునీరు ఇంటి పక్కవారు అందించాల్సిందేనట. కనీసం ఇంట్లో పురుషులు కూడా అక్కడకు అడుగుపెట్టడానికి వీలు లేదు. ఈ నియమాన్ని తాము కొన్ని సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
undefined
గతంలో వీళ్లకు వాటర్ పైప్ లైన్ ఉండేదట. అందరూ పైప్ లైన్ ద్వారా వాటర్ వినియోగించుకునేవారు. అయితే.. అది రోడ్డు విస్తరణ సమయంలో పాడైందట. తర్వాత దానిని సరిచేసే పని విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. పైప్ లైన్ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో వాటర్ పట్టుకోనిచ్చేవారు కాదట.
undefined
అంతేకాదు.. ఈ ఊర్లో మరో రూల్ కూడా ఉంది. ఆ గ్రామంలో మహిళలు కేవలం ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలి. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లడానికి లేదు. ఇది ఆ గ్రామంలో అమలౌతున్న ఆంక్షలు కాగా.. అందరూ దానిని ఫాలో అవుతూనే ఉన్నారు.
undefined
click me!