నీతా అంబానీ ధరించిన డైమండ్ నక్లెస్ ధర ఎంతో తెలుసా?

First Published | Mar 4, 2024, 3:09 PM IST

 నీతా అంబానీ ధరించిన చీరలు, జ్యూవెలరీ కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
 

ప్రస్తుతం ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి గురించే వార్తలు వస్తున్నాయి. ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. బాలీవుడ్ సెలబ్రెటీలు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వారి ఫోటోలు సైతం నెట్టింట వైరల్ గా మారాయి. వాటితో పాటు.. నీతా అంబానీ ధరించిన చీరలు, జ్యూవెలరీ కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
 


అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జమ్నా నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నీతా అంబానీ గత కొన్ని రోజులుగా నదితీరో ఈవెంట్‌లలో తన లగ్జరీ లైఫ్ ష్టైల్ ని  ప్రదర్శిస్తోంది. గ్రాండ్ చీర, నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

Latest Videos



అనంత్ అంబానీ ,రాధిక మర్చంట్  'హస్తాక్షర' ఈవెంట్‌లో నీతా అంబానీ మనీష్ మల్హోత్రా చీరలో అద్భుతంగా కనిపించింది. దానితో ధరించిన డైమండ్ నెక్లెస్ అందరినీ అబ్బురపరిచింది.


ఈ వేడుక కోసం నీతా కాంచీపురం చీరను ధరించి కోట్ల విలువైన పచ్చలు పొదిగిన వజ్రాల హారాన్ని ధరించారు. ఇది రెండు పెద్ద లాకెట్టులకు జోడించిన పచ్చలతో కూడిన పొడవైన హారము. మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులు, బ్యాంగిల్స్ , రింగ్ కూడా ధరించారు.
 


నీతా నెక్లెస్‌లోని పచ్చలు, వజ్రాల సైజు చూస్తే అవి అత్యంత విలువైన క్యారెట్‌లని అర్థం చేసుకోవచ్చు. పీఓపీ డైరీస్‌లో వచ్చిన నివేదిక ప్రకారం నీతా ఆభరణాల విలువ కోటి రూపాయలు. నివేదికను విశ్వసిస్తే, మాల ధర సుమారు రూ. 400-500 కోట్ల వరకు ఉంటుందట.

nita ambani


మార్చి 3, 2024న అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ల ముగింపు కోసం, నీతా అంబానీ చేనేత కాంచీపురం చీరను ఎంచుకుంది. దానికి ఒక పచ్చ హారము జత చేశారు. ఇది కోహినూర్ వజ్రం కంటే తక్కువేమీ కాదు.


రిలయన్స్ లగ్జరీ రిటైల్ బ్రాండ్ స్వదేశ్‌తో కలిసి ఏస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీనిని రూపొందించారు. చీరలో స్కాలోప్డ్ బార్డర్‌లపై క్లాసిక్ సాంప్రదాయ జర్దోసీ వర్క్ కనిపించింది. చీర  స్లీవ్‌లకు ప్రత్యేకమైన గోటా వర్క్ ఉంది.

ప్రీ వెడ్డింగ్ వేడుకలో మొదటి రోజు కోసం నీతా అంబానీ స్టైలిష్ వైన్ కలర్ గౌనుని ఎంచుకుంది.వైన్-హ్యూడ్ అలంకరించిన స్టిలెట్టోస్ , పచ్చ-పొదిగిన వజ్రాభరణాలను ధరించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

click me!