నీతా అంబానీ రోజూ ఆ డ్రింక్ ను తాగుతుందట. ఎందుకో తెలుసా?

First Published | Jun 3, 2024, 12:05 PM IST

నీతా అంబానీ వయసు 60 ఏండ్లు అంటే నమ్మశక్యంగా ఉండదు. ఎందుకంటే ఆమె అంత యంగ్ గా కనిపిస్తుంది కాబట్టి. నిజమేంటంటే.. నీతా అంబానీ వయసు కనిపించకుండా  రోజూ ఒక జూస్ ను తాగుతుందట. అదేంటంటే? 
 

బిలియనీర్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె రిలయన్స్ ఫౌండేషన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్ పర్సన్, వ్యవస్థాపకురాలు.నీతా అంబానీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వృత్తిపరమైన మైలురాళ్లను సాధించారు.
 

ప్రస్తుతం నీతా అంబానీ వయసు 60 ఏండ్లు. అయినా ఆమె వయసు ఇంత అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఈమె అంత యవ్వనంగా కనిపిస్తుంది. ఈమెను చూసిన వాళ్లు ఎవ్వరైనా 40 ఏండ్లకు మించి ఉండవనే అనుకుంటారు. ఎందుకంటే ఈమె చూడటానికి అంత యంగ్ గా కనిపిస్తుంది మరి. మీకు తెలుసా? దీనికి ఒక సీక్రేట్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


60 ఏండ్ల నీతా అంబానీ క్రమశిక్షణతో కూడిన, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటారు. ఆమె మెరిసే చర్మానికి ఆరోగ్యకరమైన ఆహారాలే రహస్యమట.  అవును నీతా అంబానీ స్కిన్ సీక్రెట్ కూడా ఆహారమే. అదే బీట్ రూట్ జ్యూస్. అవును నీతా అంబానీ ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ ను తాగుతుంటారు. ఆమె బరువు బరువు తగ్గే జర్నీలో రోజుకు రెండు గ్లాసుల బీట్ రూట్ జ్యూస్ ను తాగేవారు.  అప్పటి నుంచి ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ ను తాగుతూ వస్తున్నారట.
 

బీట్ రూట్ లో విటమిన్ సి తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అలాగే ఇవి అకాల వృద్ధాప్యాన్ని కూడా నివారిస్తాయి. ఈ జ్యూస్ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
 

బీట్ రూట్ లో ఉండే సహజ వర్ణద్రవ్యాలు చర్మం రంగును సమతుల్యంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే ముఖంపై ఉన్న నల్లమచ్చలను, తెల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని గ్లో చేస్తుంది. అలాగే మంచి రంగును ఇస్తుంది. 

బీట్ రూట్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. బీట్ రూట్ లో నిర్విషీకరణ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది చర్మం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే రంగును మెరుగుపరుస్తుంది. మొటిమలు అయ్యే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. 

బీట్ రూట్ జ్యూస్ ను తయారుచేయడానికి 4 నుంచి 6 బీట్ రూట్ల తీసుకుని వాటి తొక్కతీసి తురమండి. దదీన్ని  జ్యూసర్ లో వేసి వడకట్టండి. అందులో రుచికి తగ్గ ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి తాగాలి. ఈ జ్యూస్ లో పోషకాలు పెరగాలంటే క్యారెట్ ను దానితో పాటు గ్రైండ్ చేసి వడకట్టి తాగండి. ఇది మీ చర్మానికి నేచురల్ గ్లో ను ఇస్తుంది.

Latest Videos

click me!